Maharashtra Battle: సుప్రీంకోర్టుకు చేరిన 'మహా' రాజకీయం, ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌, దాఖలు చేసిన మహారాష్ట్ర వికాస అఘాడి కూటమి, గవర్నర్ నిర్ణయంపై ఆగ్రహం

దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రి(Devendra Fadnavis and Ajit Pawar)గా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ శనివారం సాయంత్రం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి.

Sonia Gandhi, Uddhav Thackeray and Sharad Pawar (Photo-PTI)

Mumbai, November 23: మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టు(Supreme Court)కు చేరాయి. దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రి(Devendra Fadnavis and Ajit Pawar)గా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు శనివారం సాయంత్రం సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. దేవేంద్ర ఫడ్నవిస్ ను గవర్నర్ ఆహ్వానించడంపై మూడు పార్టీలు అభ్యంతరం తెలిపాయి. తమకు 144 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని పిటిషన్ లో వెల్లడించాయి.

ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన , ఎన్సీపీ, కాంగ్రెస్ ను (Uddhav Thackeray-led Shiv Sena, Sharad Pawar's NCP and Congress) ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కోరాయి. సంఖ్యాబలం లేకున్నా ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని..24 గంటల్లో బలపరీక్ష నిర్వహించేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణలో శివసేన తరపున అభిషేక్ సింఘ్వీ వాదించనున్నారు.  రేపు ఉదయం ఈ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదనలను విననుంది.

ANI Tweet:

కాగా అక్టోబర్‌ 24న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ-శివసేన (BJP-Shiv sena) దోస్తీ తెగదెంపులు కావడంతో.. కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో వారికి ఊహించని షాక్‌ తగిలింది. ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ (Maharashtra governor Bhagat Singh Koshyari)నిర్ణయంపై మహారాష్ట్ర వికాస అఘాడి (శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్) కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. 3 పార్టీలకు కలిపి 144 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. తమ కూటమికి కాకుండా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తూ గవర్నర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరోవైపు ఎన్సీపీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీకి మద్దతిచ్చిన అజిత్ పవార్ వర్గం (Ajit Pawar-led Nationalist Congress Party) క్రమంగా బలహీనపడుతున్నట్లు తెలుస్తోంది. ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేసే సమయంలో అజిత్ పవార్ వెంట 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐతే వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు మధ్యాహ్నం శరద్ పవార్ చెంతన చేరారు. ఎన్సీపీ ఎమ్మెల్యే సమావేశానికి దిలీప్ బంకార్, సునీల్ షెల్కె, సునీల్ భాసుర, సంజయ్ బన్సోడె హాజరయ్యారు. ఇక అజిత్ వర్గంలో మిగిలిన ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు.

మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి 145 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇక 29 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల(independent legislators )ను తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం ఇదివరకే పావులు కదిపింది. వారి మద్దతుతో బల పరీక్షలో నెగ్గాలని ప్రణాళిలకు రచిస్తోంది.