Maharashtra Politics: మహారాష్ట్రను టార్గెట్ చేసిన బీజేపీ, శివసేన ఒప్పుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని తెలిపిన చంద్రకాంత్ దాదా పాటిల్, వ్యూహాలను సిద్ధం చేయాలని నడ్డా సూచన
గతంలో సీట్ల పంపకాల్లో విభేదాల కారణంగా ఎన్డీయే కూటమి నుంచి విడిపోయిన పార్టీలను తిరిగి వెనక్కి రప్పించుకునేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందుకు ఆ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ చంద్రకాంత్ దాదా పాటిల్ (Maharashtra Bjp chief Chandrakant Dada Patil) చేసిన కీలక వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శివసేన (Shiv Sena) ఒప్పుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) నేతృత్వంలోని శివసేనను తిరిగి ఎన్డీయేలో (NDA) చేర్చుకునేందుకు తామకు ఏమాత్రం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు.
Mumbai, July 28: మహారాష్ట్రలో తిరిగి కాషాయ జెండా ఎగరేసేందుకు బీజేపీ (BJP) నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. గతంలో సీట్ల పంపకాల్లో విభేదాల కారణంగా ఎన్డీయే కూటమి నుంచి విడిపోయిన పార్టీలను తిరిగి వెనక్కి రప్పించుకునేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందుకు ఆ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ చంద్రకాంత్ దాదా పాటిల్ (Maharashtra Bjp chief Chandrakant Dada Patil) చేసిన కీలక వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శివసేన (Shiv Sena) ఒప్పుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) నేతృత్వంలోని శివసేనను తిరిగి ఎన్డీయేలో (NDA) చేర్చుకునేందుకు తామకు ఏమాత్రం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి రంగంలోకి రావాలి, బీజేపీ నియమించిన గవర్నర్లు రాజ్యాంగాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్నారు, రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై స్పందించిన కాంగ్రెస్ నేత చిదంబరం
పాటిల్ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో (Maharashtra Politics) చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో పాగా వేసేందుకు గతంలోనూ బీజేపీ ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను ఎన్డీయేలో ఆహ్వానిస్తూ కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ బహిరంగ ప్రకటన చేశారు. అయితే దీనికి శరద్ పవార్ (Sarad Pawar) ఒప్పుకోకపోవడంతో అది తెర వెనక్కి వెళ్లిపోయింది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఆఫీస్ బేరర్స్ సమావేశంలో నేతలకు కీలక ఆదేశాలు జారీచేశారు.
Here's Ajit Pawar Tweet
గత ఏడాది అధికారం నుంచి దూరమైన మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి రావాలని, దీని కోసం పటిష్టమైన వ్యూహాలను సిద్ధం చేయాలని ఆ రాష్ట్ర బీజేపీ శాఖకు నడ్డా సూచనలు చేశారు. అంతేకాకుండా పూర్వ స్నేహితుడు శివసేనను సైతం ఎన్డీయేలోకి వచ్చే విధంగా మంతనాలు చేయాలని సలహాలు ఇచ్చారు.
Here's Chandrakant Dada Patil Tweet
ఈ పరిస్థితులు ఇలా ఉంటే శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సర్కార్‌ను మూడు చక్రాల బండితో పోలుస్తూ స్టీరింగ్ తన చేతిలో ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్థవ్ థాకరే చేసిన వ్యాఖ్యలపై సంకీర్ణ సర్కార్‌లోనే కలకలం రేగింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ (NCP-leader Ajit Pawar) థాకరేకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫోటోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పక్కన కూర్చోగా అజిత్ పవార్ స్టీరింగ్ పట్టుకుని ఉన్నారు. ఈ ఫోటో పెట్టి హారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధిపతి, మహా వికాస్ అఘాది (Maha Vikas Aghadi) నేతకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవార్ తన పోస్ట్‌ను ముగించారు. రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చేశాయి, 2021లోపు భారత్‌కు రానున్న 36 విమానాలు, గాలిలో ఇందనాన్ని నింపుకుని 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం
దీనికి థాకరే సామ్నా వేదికగా స్పందించారు. తన సర్కార్‌ను విపక్షాలు కూల్చలేవని..తన ప్రభుత్వ భవితవ్యం వారి చేతిలో లేదని థాకరే తెలిపారు. తన ప్రభుత్వం ఆటోరిక్షా(త్రిచక్రవాహనం) వంటిదని, దాని స్టీరింగ్ తన చేతిలో ఉందని, వెనుక సీట్లలో కాంగ్రెస్, ఎన్సీపీలు ఉన్నాయని దమ్ముంటే తన ప్రభుత్వాన్ని కూల్చాలని థాకరే సవాల్ విసిరారు. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతుండగానే అయోధ్యలో ఆగస్ట్ 5న రామ మందిర నిర్మాణానికి నిర్వహించే భూమి పూజకు తాను హాజరవుతానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు.
మహారాష్ర్టలో జూలై 31 వరకు విధిందిన లాక్‌డౌన్ నిబంధనల్ని సడలిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో శరద్ పవార్ కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ సడలింపులు ముఖ్యమంత్రికి ఇష్టం లేదని వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఈ వ్యాఖ్యల్ని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శివసేన పత్రిక సామ్నా వేదికగా ఖండించారు. మహారాష్ర్టలో లాక్‌డౌన్ సడలింపు అంశంపై ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, తనకు మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు తలెత్తలేదని తెలిపారు.
ఈ పరిణామాల మధ్య చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. మరి ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో వేచి చూడాలి.