Suspense Continues Over 'MAHA' CM: అయిదేళ్లు శివసేన నుంచే మహారాష్ట్ర సీఎం, రేసులో ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్, అరవింద్ సావంత్, చర్చల అనంతరం సీఎంపై కీలక ప్రకటన,వెల్లడించిన సంజయ్ రౌత్
అధికారం చేజిక్కుంచుకునే దిశగా శివసేన(Shivsena), ఎన్సీపీ(NCP), కాంగ్రెస్ (Congress) చేసిన ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి.
Mumbai, November 22: మహారాష్ట్ర (Maharashtra)లో దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు నేటితో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారం చేజిక్కుంచుకునే దిశగా శివసేన(Shivsena), ఎన్సీపీ(NCP), కాంగ్రెస్ (Congress) చేసిన ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. నేడు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ (Shiv Sena-Nationalist Congress Party-Congress alliance) నేతల మధ్య కీలక సమావేశం అనంతరం మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు(Maharashtra Government Formation )పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
శివసేనకు సీఎం పదవిని ఇచ్చేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ అంగీకరించినట్లు సమాచారం. అయితే.. శివసేన నేతలు చెబుతున్నట్లు ఐదేళ్ల పాటు ఆ పార్టీ నేతనే సీఎంగా ఉంటారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే సీఎం పదవిపై ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray)ఆసక్తి చూపడం లేదని తెలిసింది. తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను సీఎం చేయాలన్న ప్రతిపాదనకు ఎన్సీపీ, కాంగ్రెస్ ఒప్పుకోకపోవడంతో తాను కూడా ఆ పదవి చేపట్టకూడదన్న నిర్ణయానికి ఉద్దవ్ వచ్చినట్లు సమాచారం.
ఇదే కొనసాగితే మహారాష్ట్ర సీఎం రేసులో శివసేన ముఖ్య నేతలు సంజయ్ రౌత్, అరవింద్ సావంత్‌లలో ఎవరో ఒకరు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఇద్దరి పేర్లను పార్టీ వర్గాలు ఇప్పటికే సూచించినట్లు తెలిసింది. శరద్‌పవార్, సోనియాతో చర్చించిన అనంతరం ఉద్దవ్ ఠాక్రే శివసేన సీఎం ఎవరనే విషయంపై స్పష్టత ఇవ్వనున్నారు. 'మహా'లో మహారాష్ట్ర వికాస్ ఆఘాడి కూటమి
ఈ పరిణామాలు ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం పదవిపై శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ (Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సంకీర్ణ ప్రభుత్వం పూర్తికాలం ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగుతుందని చెప్పారు.‘‘ఐదేళ్ల పాటు శివసేన పార్టీకి చెందిన ముఖ్యమంత్రి పరిపాలిస్తారని సంజయ్ రౌత్ శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. మహారాష్ట్ర ప్రజలు, శివసైనికులు ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారని సంజయ్ చెప్పారు.