Maharashtra government formation alliance-christened-maharashtra-vikas-aghadi (Photo-ANI)

Mumbai, November 22: మహారాష్ట్రలో అధికార ఏర్పాటు(Maharashtra Government Formation)కు తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌(Shiv Sena, NCP and Congres)  సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగానే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుదిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో నాలుగైదు రోజుల్లో కొత్త సర్కారు కొలువుదీరే అవకాశం ఉంది.

ఈ రోజు ముంబైలో మూడు పార్టీల ప్రతినిధులు చివరిసారిగా సమావేశమై, ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఈ కూటమికి ‘మహారాష్ట్ర వికాస కూటమి’ (మహారాష్ట్ర వికాస్‌ ఆఘాడి) (Maharashtra Vikas Aghadi) అని పేరు పెట్టనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

కొత్త కూటమి

కాగా ఢిల్లీలో గురువారం సోనియాగాంధీ (Soniay gandhi) అధ్యక్షతన ఆమె నివాసంలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శివసేన(Shiv Sena) తో పొత్తుకు సీడబ్ల్యూసీ (CWC)అంగీకరించిందని విశ్వసనీయ సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌, ఎన్సీపీ (NCP) నేతలు మల్లికార్జున ఖర్గే, అహ్మద్‌ పటేల్‌, అజిత్‌ పవార్‌, నవాబ్‌ మాలిక్‌ తదితరులు శరద్‌పవార్‌ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కనీస ఉమ్మ డి ప్రణాళిక (సీఎంపీ), పదవుల పంపకం వంటి అంశాలపై చర్చించి, నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

సమావేశం అనంతరం కాంగ్రెస్‌ నేత పృథ్వీరాజ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుపై రెండు పార్టీల మధ్య చర్చలు ముగిశాయని, అన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని తెలిపారు. నేడు ముంబైలో కూటమిలోని మిగతా పార్టీలతో, శివసేనతో సమావేశమై చర్చలు జరుపుతామని, ఆ తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తామన్నారు.

సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే (అంచనా)

ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమ కూటమి సిద్ధంగా ఉన్నదంటూ గవర్నర్‌ కోశ్యారీకి శనివారం లేఖ అందిస్తామని శివసేన నేత సంజయ్‌రౌత్‌ (Sanjay Rout) తెలిపారు. దీనిపై మూడు పార్టీల ఎమ్మెల్యేల సంతకాలు ఉంటాయన్నారు.