Maharashtra: మీ మెజారిటీని ఫ్రూవ్ చేసుకోండి, మహారాష్ట్ర సీఎం షిండేకు గవర్నర్ ఆదేశాలు, రేపు అసెంబ్లీలో బలపరీక్ష, ఏక్‌నాథ్‌ షిండే, ఫడ్నవీస్‌లకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం ఉద్ధవ్

బీజేపీ, శివసేన రెబెల్‌ ఎమ్మెల్యేలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. మ‌హారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండే.. సోమ‌వారం అసెంబ్లీలో త‌న మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశాలు (prove majority in Assembly on July 2) జారీ చేశారు.

Mumbai, July 1: మహారాష్ట్రలో గత కొద్ది కాలంటోనడుస్తున్న రాజకీయ సంక్షోభానికి తెరపడుతూ... బీజేపీ, శివసేన రెబెల్‌ ఎమ్మెల్యేలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. మ‌హారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండే.. సోమ‌వారం అసెంబ్లీలో త‌న మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశాలు (prove majority in Assembly on July 2) జారీ చేశారు.. అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య గురువారం రాత్రి ఏక్‌నాథ్ షిండే మ‌హారాష్ట్ర సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. రెండు రోజుల క్రితం మాజీ సీఎం ఉద్ధ‌వ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో మ‌హా రాజ‌కీయాల్లో కొత్త ట్విస్ట్ మొద‌లైంది.

గురువారం సాయంత్రం 7.30 గంటలకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే (CM Eknath Shinde), డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌తో ప్రమాణం చేయించారు. అనంతరం సీఎం ఏక్‌నాథ్‌ షిండే తొలి క్యాబినెట్‌ భేటీ నిర్వహించారు. శనివారం, ఆదివారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని నిర్ణయించారు. షిండే తన మెజారిటీని నిరూపించుకోవడానికి గవర్నర్‌ (Governor Bhagat Singh Koshyari) శనివారం వరకు గడువునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికే నా ప్రాధాన్యం. అన్ని వర్గాలను కలుపుకొని పోతాను’ అని ప్రమాణ స్వీకారం అనంతరం షిండే అన్నారు. ఏక్‌నాథ్‌ షిండే, ఫడ్నవీస్‌లను ప్రధాని మోదీ అభినందించారు. షిండే ప్రజా నాయకుడని కొనియాడారు. ఆయన నాయకత్వంతో మహారాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.

కింగ్ మేకర్ అవుతాడనుకుంటే ఏకంగా సీఎం అయ్యాడు, మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ శంభాజీ షిండే ప్రమాణ స్వీకారం, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్

మహారాష్ట్రలో ఈడీ సర్కార్‌ కొలువుదీరిందని కాంగ్రెస్‌ విమర్శించింది. ఏక్‌నాథ్‌ షిండే పేరులో మొదటి అక్షరం ఈ. దేవేంద్ర ఫడ్నవీస్‌లో మొదటి అక్షరం డీని కలిపి ఇలా అభివర్ణించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీతో దాడులు చేయించి ఎంవీఏ కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసిందని ఆరోపించింది. మహారాష్ట్రలో ఈడీ సర్కారుకు స్వాగతం’ అని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా ట్వీట్‌ చేశారు. ఇక ఏక్‌నాథ్‌ షిండే, ఫడ్నవీస్‌లకు ఉద్ధవ్‌ ఠాక్రే శుభాకాంక్షలు తెలిపారు. షిండే పాలనలో మహారాష్ట్రకు మంచి జరుగుతుందని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన ట్వీట్‌ చేశారు.

వేయ్ చిందేయ్.. గోవాలో శివసేన రెబల్ ఎమ్మెల్యేల డ్యాన్స్ వీడియో వైరల్, సీఎంగా రెబల్ ఎమ్మెల్యే ఏకనాథ్ షిండే  ప్రమాణ స్వీకారం

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ఏదొక రోజున తాము తీసుకున్న నిర్ణయానికి కచ్చితంగా చింతిస్తారని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. వారి దారి వారు చూసుకున్నారని, అసమ్మతి నేతలు బీజేపీతో స్వేచ్ఛగా జతకట్టుకోవచ్చని, దీనికి ఎటువంటి అడ్డంకులు సృష్టించమని పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో శివసేన నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పారు. బీజేపీపై పరోక్షంగా మాట్లాడుతూ శివసేనలో తిరుగుబాటు రేపాలని ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేసిందెవరో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. ఎంవీఏ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించడంతో పాటు పలు విధాలుగా కుట్రలు చేశారని పేర్కొన్నారు. కాగా, మనీలాండరింగ్‌ కేసులో శుక్రవారం ఈడీ విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు.

ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో శివసేన భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. పార్టీ నుంచి ఉన్న 55 మందిలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బృందంలోనే ఉండటం ఆ పార్టీ మనుగడపై అనుమానాలను పెంచుతున్నది. అయితే శివసేన నుంచి తాము వెళ్లిపోబోమని ఏక్‌నాథ్‌ షిండే వర్గం ప్రకటించింది. ఒక వేళ షిండే వర్గం శివసేనలోనే కొనసాగితే పార్టీలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయి. ముఖ్యమంత్రిగా షిండే పార్టీని, కార్యకర్తలను మరింత నియంత్రణలోకి తెచ్చుకొనే అవకాశం ఉంటుంది. అయితే, షిండే ప్రస్తుతం సీఎం పీఠం ఎక్కినప్పటికీ తిరుగుబాటు నేతగా, పార్టీకి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారని, ఆయనను ప్రజలు నమ్మరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం పతనంతో కాంగ్రెస్‌ మరో రాష్ట్రంలో అధికారం కోల్పోయినట్టయింది. ప్రస్తుతం ఆ పార్టీ రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో సొంతంగా అధికారంలో ఉండగా, జార్ఖండ్‌లో జేఎఎంతో కలిసి అధికారం పంచుకుంటున్నది. ఇటీవల జరిగిన ఐదురాష్ర్టాల ఎన్నికల్లో హస్తం పార్టీకి ఘోరపరాభవం ఎదురైంది. పంజాబ్‌లో అధికారం కోల్పోగా.. యూపీ, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లో ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకోవడంలోనూ విఫలమైంది.