Mizoram Election Results 2023: మిజోరాం ఎన్నికల ఫలితాలు, అధికార పార్టీ ఎంఎన్‌ఎఫ్‌కు బిగ్ షాక్, అధికార ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించిన జడ్‌పీఎం, ఓడిపోయిన సీఎం జోర‌మ‌తంగ

ఇక ఆ రాష్ట్ర సీఎం(Mizoram Chief Minister) జోర‌మ‌తంగ ఓట‌మి పాల‌య్యారు. మీజో నేష‌న‌ల్ ఫ్రంట్‌కు చెందిన ఆయ‌న రెండు వేల ఓట్ల తేడాతో ప‌రాజ‌యం చ‌విచూశారు

Mizoram Election 2023 Results

రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ మరియు ఛత్తీస్‌గఢ్ అనే నాలుగు రాష్ట్రాల ఫలితాలు ప్రకటించిన ఒక రోజు తర్వాత మిజోరం అసెంబ్లీ ఎన్నిక‌ల ఫలితాలు వెలువడుతున్నాయి. 40 నియోజక వర్గాలున్న మిజోరంలో అధికార ఎంఎన్‌ఎఫ్‌(మిజో నేషనల్‌ ఫ్రంట్‌), జడ్‌పీఎం (జొరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌), కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో ఎంఎన్‌ఎఫ్, జెడ్పీఎం, కాంగ్రెస్ పోటీ చేయగా, బీజేపీ 23 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది.

మిజోరంలో మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 80 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్‌ 26, జడ్‌పీఎం 8, కాంగ్రెస్‌ 5, బీజేపీ ఒక స్థానం గెలుపొందాయి.నవంబరు 7న మిజోరం అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు, గెలిచిన 119 అభ్యర్థుల పూర్తి జాబితా ఇదిగో..

తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో జడ్‌పీఎం (జొరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌) పార్టీ అధికార ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ స్థానాలకు దక్కించుకుంది. ఇక ఆ రాష్ట్ర సీఎం(Mizoram Chief Minister) జోర‌మ‌తంగ ఓట‌మి పాల‌య్యారు. మీజో నేష‌న‌ల్ ఫ్రంట్‌కు చెందిన ఆయ‌న రెండు వేల ఓట్ల తేడాతో ప‌రాజ‌యం చ‌విచూశారు. ఐజ్వాల్ ఈస్ట్‌-1 స్థానం నుంచి పోటీ చేసిన జోరం పీపుల్స్ మూమెంట్‌(జెడ్‌పీఎం) అభ్య‌ర్థి లాల్‌త‌న్ సంగ విజ‌యం సాధించారు. లాల్‌త‌న్‌సంగ‌కు 10727 ఓట్లు పోల‌వ్వ‌గా, జోర‌మ‌తంగ‌కు 8626 ఓట్లు పోల‌య్యాయి.

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పూర్తి కథనం, కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానల్లో విజయం

ఎన్నికల సంఘం ప్రకారం, మిజోరాం అసెంబ్లీలో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) మెజారిటీ సాధించింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా 40 స్థానాలకు గాను 21 స్థానాల్లో విజయం సాధించి మరో ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిజో నేషనల్ ఫ్రంట్ 10 స్థానాల్లో విజయం సాధించగా మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భారీ ఓటమి తర్వాత మిజోరం సిఎం జోరంతంగా రాజీనామా చేయనున్నారు. మిజోరం సిఎం జోరంతంగా సాయంత్రం 4 గంటలకు గవర్నర్ హరిబాబు కంభంపాటిని కలవనున్నారు, రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.

ZPM గెలిచిన స్థానాలు

కొలాసిబ్, చాల్ఫిల్, తావీ, ఐజ్వాల్ నార్త్-II, ఐజ్వాల్ వెస్ట్-I, ఐజ్వాల్ వెస్ట్-II, ఐజ్వాల్ వెస్ట్-III, ఐజ్వాల్ సౌత్-I, ఐజ్వాల్ సౌత్-III, లెంగ్‌టెంగ్, టుయిచాంగ్, ఛాంఫై నార్త్, టుయికుమ్, హ్రాంగ్‌టుర్జో , సౌత్ టుయిపుయ్, లుంగ్లీ వెస్ట్, లుంగ్లీ సౌత్, లాంగ్ట్లై ఈస్ట్.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..