Narendra Modi 3.0 First Cabinet Meeting Today: నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేంద్ర కేబినెట్‌ తొలి సమావేశం నేడే.. మొత్తం 71 మంది సభ్యులతో నేటి సాయంత్రం ఐదింటికి ప్రధాని భేటీ.. 100 రోజుల కార్యాచరణపై చర్చించే అవకాశం

ఈ క్రమంలో ఇవాళ కేంద్ర కేబినెట్ తొలి సమావేశం సాయంత్రం ఐదింటికి ప్రధాని అధికారిక నివాసంలో జరుగనున్నది.

Modi 3.0 (Credits: X)

Newdelhi, June 10: కేంద్రంలో మోదీ (PM Modi) నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో ఇవాళ కేంద్ర కేబినెట్ తొలి సమావేశం (Narendra Modi 3.0 First Cabinet Meeting Today) సాయంత్రం ఐదింటికి ప్రధాని అధికారిక నివాసంలో జరుగనున్నది. మొత్తం 71 మంది సభ్యులతో ప్రధాని భేటీ కానున్నారు. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా 100 రోజుల కార్యాచరణపై చర్చిస్తారని తెలుస్తోంది. భారత్ కు పెట్టుబడుల ఆకర్షణ, వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు, పలు అంశాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

గట్టిగా తుమ్మాడు.. అంతే పెట్టున పేగులు బయటకొచ్చాయ్‌.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన.. అసలేం జరిగిందంటే??

మంత్రిత్వశాఖల కేటాయింపుపై ఉత్కంఠ

కేబినెట్ భేటీ నేపథ్యంలో మంత్రిత్వశాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా కీలక మంత్రిత్వశాఖలను బీజేపీ తన దగ్గరే ఉంచుకునే అవకాశం ఉంది. అటు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కేటాయించిన మంత్రి పదవులకు ఎలాంటి శాఖలు కేటాయిస్తారోననే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ముచ్చట‌గా మూడోసారి ప్ర‌ధానిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన న‌రేంద్ర మోదీ, కేబినెట్ లోని మంత్రులు వీళ్లే (వీడియో ఇదుగోండి)