Ajit Pawar Got Clean Chit: ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు ఊరట, విదర్భ ఇరిగేషన్ స్కాంలో క్లీన్ చిట్, నిధుల విడుదలలో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పిన ఏసీబీ సూపరింటెండెంట్

ఈ మహారాష్ట్ర(Maharashtra)లో నీటి పారుదల కుంభకోణంలో ఇప్పుడు ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు ఊరట లభించింది. మహారాష్ట్ర యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)(Maharashtra Anti-Corruption Bureau) ఈ కేసులో అజిత్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.

NCP leader Ajit Pawar gets clean chit in Vidarbha irrigation scam (Photo-ANI)

Mumbai, December 6: పదేళ్ల క్రితం మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన విదర్భ ఇరిగేషన్ స్కాం(Vidarbha irrigation scam)లో ఎన్పీపి నేత అజిత్‌ పవార్‌ (NCP leader Ajit Pawar) ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.  ఈ మహారాష్ట్ర(Maharashtra)లో నీటి పారుదల కుంభకోణంలో ఇప్పుడు ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు ఊరట లభించింది. మహారాష్ట్ర యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)(Maharashtra Anti-Corruption Bureau) ఈ కేసులో అజిత్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.

ఈ మేరకు నవంబర్ 27 నాటి తేదీతో బాంబే హైకోర్టు (Bombay High court)కు ఏసీబీ సూపరింటెండెంట్ రష్మీ నందేద్కర్ పేరిట 16 పేజీల అఫిడవిట్ అందింది. ఈ కేసులో అజిత్ పవార్ కు వ్యతిరేకంగా ఏ విధమైన ఆధారాలు లభించలేదని ఆమె తెలిపారు. ఆ సమయంలో అజిత్, విదర్భ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారని, నిధులను విడుదల చేయడంలో ఎటువంటి అవకతవకలూ జరగలేదని స్పష్టం చేశారు.

ANI Tweet

పవార్ బీజేపీలోకి వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం: శరద్ పవార్

ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ కారణంగానే ఎన్నికల సమయంలో బిజెపితో కలిసి వెళ్లాలని అజిత్‌ పవార్‌ నిర్ణయం తీసుకున్నాడని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అన్నారు. ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రోజు అనగా నవంబరు 22న తాను కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమయ్యానన్నారు.

ఆ సమావేశంలో వాడివేడి చర్చ జరిగిందన్నారు. ''ఈ చర్చ సందర్భంగా అజిత్‌ పవార్‌ చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ మరిన్ని మంత్రి పదవులను డిమాండ్‌ చేసింది. నేను సమావేశం నుండి బయటకు వచ్చేశాను. అజిత్‌ కూడా బయటకు వచ్చారు. మరుసటి రోజు మనం ఎలా పనిచేయాలో తెలియడం లేదంటూ నా సహచరులతో అజిత్‌ అన్నారు. ఆ రోజు రాత్రే ఫడ్నవీస్‌తో అజిత్‌ భేటీ అయ్యాడు'' అని పవార్‌ తెలిపారు.

కాంగ్రెస్‌, శివసేనతో చర్చలు జరుపుతూనే ఫడ్నవీస్‌తోనూ అజిత్‌ చర్చలు కొనసాగించిన విషయాన్ని శరద్‌ పవార్‌ అంగీకరించారు. అజిత్‌ వెనుక తన ప్రమేయమున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఫడ్నవీస్‌తో అజిత్‌ సంప్రదింపులు తనకు తెలుసునని, అది ప్రమాణ స్వీకారం దాకా వెళ్తుందని ఊహించలేకపోయానని శరద్‌ పవార్‌ చెప్పారు.

ఎన్‌సిపి- కాంగ్రెస్‌ మధ్య చర్చల తీరుపై పూర్తి అసంతృప్తితో ఉన్నట్లు తిరిగి ఎన్‌సిపిలోకి వచ్చిన అనంతరం అజిత్‌ పవార్‌ చెప్పారని అన్నారు. అందువల్లే ఆ నిర్ణయం తీసుకుని ఉంటాడని, ఆ తరువాత అది సరైన నిర్ణయం కాదని తెలుసుకుని మరుసటి రోజు ఉదయమే తిరిగి తనవద్దకు వచ్చాడని శరద్‌ పవార్‌ తెలిపారు.

శివసేన, కాంగ్రెస్‌, ఎన్‌సిపి సమావేశానికి హాజరైన కొద్ది గంటల వ్యవధిలోనే అజిత్‌ పవార్‌ బిజెపికి మద్దతిచ్చి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ఆ తరువాత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.