NDA 3.0 Govt Formation: జూన్ 9న సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరిన ఎన్టీఏ పార్లమెంటరీ నాయకుడు, దేశ ప్రజలకు కృతజ్ఞతలు..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ముర్మును (President Droupadi Murmu) కోరారు.
New Delhi, June 7: ఈ రోజు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన నరేంద్రమోదీ.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ముర్మును (President Droupadi Murmu) కోరారు. ఆ మేరకు తనకు మద్దతిస్తున్న ఎంపీల పేర్లతో కూడిన జాబితాను సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము, మోదీ ఒకరికొకరు పుష్పగుచ్ఛాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని (NDA 3.0 Govt Formation) కావటం ఇప్పటికే ఖరారైంది. ఆదివారం సాయంత్రం మోదీ (Narendra Modi) ప్రధానిగా కర్తవ్యపథ్‌లో ప్రమాణం చేయనున్నారు.ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రమాణస్వీకారం చేసేలా ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఆ రోజు ప్రధానితోపాటే కొందరు మంత్రులుగా కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నది. మోదీనే మా పీఎం, తేల్చి చెప్పిన చంద్రబాబు, నితీశ్, జూన్ 9న నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం
కేంద్రంలో ఈసారి బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జేడీయూ ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. ఎన్డీయే కూటమిలోని పార్టీల ఎంపీలు ఇవాళ ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. బీజేపీ సొంతంగా 240 సీట్లు గెలువగా.. సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లను దాటలేకపోయింది. దీంతో బీజేపీ కూటమిలోని మిత్ర పక్షాల మద్దతు మరోసారి కేంద్రంలో ప్రభుత్వం కొలుదీరనుంది.
Here's Video and Pics
రాష్ట్రపతిని కలిసిన అనంతరం నరేంద్రమోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తనకు మూడోసారి సేవచేసే అవకాశం ఇచ్చిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పారు. రాష్ట్రపతిని కలిసి తనను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్న తీర్మాన ప్రతిని ఆమె అందజేశానని చెప్పారు. ఈ సందర్భంగా తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు. ఎన్డీఏ మిత్రపక్షాల తీర్మానాన్ని పరిశీలించిన అనంతరం ద్రౌపది ముర్ము మోదీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినట్లు చెప్పారు. రాష్ట్రపతి ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఆదివారం సాయంత్రం తాను మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు మోదీ వెల్లడించారు.
ఆజాదీకా అమృత్ కాల్ ఉత్సవాల తర్వాత ఇవి తొలి ఎన్నికలని, దేశానికి సేవచేసే అవకాశం మాకు మూడోసారి లభించిందని నరేంద్రమోదీ అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. మంత్రిమండలి ఏర్పాటుకు రాష్ట్రపతి పలు సూచనలు చేశారని, ప్రమాణ స్వీకారానికి ముందు కొత్త మంత్రుల పేర్లను రాష్ట్రపతికి అందజేస్తామని తెలిపారు. మున్ముందు మరింత బాధ్యత, ఉత్సాహంతో పనిచేస్తామన్నారు.
పొరుగు దేశాల ప్రముఖుల సమక్షంలో నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజు కీలక శాఖల మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశముంది. శుక్రవారం ఉదయం జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్ర మోదీని లోక్‌సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. తొలుత మోదీ పేరును రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించగా.. తెదేపా అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్ తదితర పార్టీల నేతలంగా ఏకగ్రీవంగా ఆమోదించారు