లోక్‌సభ ఎన్నికల్లో మెజారీటి సీట్లు సాధించిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం నాడు ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. కాగా.. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ యాదవ్‌లు తమ ప్రధని అభ్యర్థిగా నరేంద్ర మోదీనే మరోసారి బలపరిచారు.
సమావేశంలో ముందుగా ప్రసంగించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎంపీ రాజ్‌నాథ్ సింగ్‌లు నరేంద్ర మోదీని పార్లమెంటరీ పార్టీ లీడర్‌గా, ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ లీడర్‌గా, లోక్‌సభ పార్టీ లీడర్‌గా ప్రతిపాదించారు. అనంతరం ప్రసంగించిన మిగిలిన పార్టీల లీడర్లు కూడా ఈ ప్రతిపాదనను బలపరిచారు. ఎన్డీఏ సమావేశంలో ఆసక్తికర దృశ్యం.. వైరల్ అవుతున్న ప్రధాని మోదీ వీడియో
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలో దేశం ఎంతో పురోగతి సాధించిందని, గ్లోబర్ పవర్ హౌస్‌గా రూపొందిందని కొనియాడారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో మోదీ లాంటి నాయకుడిని చూడలేదని, దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించిన నాయకుడు మోదీయేనని అన్నారు. మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించిందని అన్నారు. మోదీ గొప్ప విజనరీ అని కొనియాడిన చంద్రబాబు.. ఆయన నాయకత్వంలో దేశం త్వరలోనే ప్రపంచ తొలి లేదా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందువల్ల మోదీనే ప్రధానిగా ఉండాలని, ఆయనే దేశాన్ని ముందుండి నడిపించాలని అన్నారు.
#TDP Chief N. Chandrababu Naidu proposes the name of @narendramodi as the Prime Minister of the country at the #NDA Parliamentary Party meeting. pic.twitter.com/t3qSicEEdv
— All India Radio News (@airnewsalerts) June 7, 2024
అనంతరం బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ దేశానికి మూడోసారి ప్రధాని కాబోతుండడం చాలా గొప్ప విషయం అన్నారు. ఇప్పటికే దేశ ప్రధానిగా మోదీ ఎంతో అభివృద్ధి చేశారని, ఇంకా ఏమైనా మిగిలుంటే అది ఈ టర్మ్‌లో పూర్తి చేసేస్తారని అన్నారు. అంతేకాకుండా.. నాలుగోసారి కూడా మోదీనే ప్రధాని అవుతారని, అప్పుడు మోదీ ప్రత్యర్థులంతా ఓడిపోతారని జోస్యం చెప్పారు. మోదీ లాంటి నాయకుడు దేశానికి అవసరం అని, ఆయనే దేశ ప్రధానికగా కొనసాగాలని అన్నారు.
#Bihar CM, JD(U) Chief @NitishKumar, supports the proposal of naming Narendra Modi as the leader of Lok Sabha, Leader of the BJP and NDA Parliamentary Party at the #NDA Parliamentary Party meeting. pic.twitter.com/kM7VAo7arz
— All India Radio News (@airnewsalerts) June 7, 2024
అనంతరం అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో నరేంద్ర మోదీని తమ నాయకుడిగా ఎన్నుకున్నాయి. ఈ క్రమంలోనే జూన్ 9న నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ సీనియర్ నేత ప్రహాద్ జోషి ప్రకటించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం అవుతుందని వెల్లడించారు.