credit: Twitter

లోక్‌సభ ఎన్నికల అనంతరం ఢిల్లీలో తొలిసారి ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ అధికారికంగా ఒకే వేదికపైకి వచ్చాయి. సంవిధాన్ సదన్ (రాజ్యాంగ భవనం)లో శుక్రవారం జరిగిన ఈ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు కూటమి పార్టీల్లోని కీలక నాయకులంతా హాజరయ్యారు. ఈ క్రమంలో పీఎం మోదీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. సమావేశానికి మోదీ హాజరవగానే సభలో ఉన్న బీజేపీ నాయకులతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా తమ తమ సీట్లలో లేచి నిలబడి కరతాళధ్వనులతో ఆయనకు ఆహ్వానం పలికారు. సభ మొత్తం ‘భారత్‌ మాతాకి జై’ నినాదాలతో మార్మోగింది. ఈ సమయంలోనే వారి మధ్య నుంచి నడుచుకుంటూ పోడియం వద్దకు చేరుకున్న మోదీ.. అక్కడ ఉంచిన భారత రాజ్యాంగానికి శిరస్సు వంచి నుదుటిని ఆనించి నమస్కరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ‘అందుకే చెంప పగలగొట్టా’, కంగనాను చెంప దెబ్బ కొట్టిన మహిళా కానిస్టేబుల్ స్పందన