'Nitish Kumar Missing': బీహార్ సీఎం కనిపించుట లేదు, పాట్నాలో కలకలం రేపుతున్న పోస్టర్లు, కాబ్, ఎన్ఆర్‌సీలపై మౌనం వహించిన నితీష్ కుమార్, పోర్న్ సైట్లు వెంటనే బ్యాన్ చేయాలంటూ ప్రధానికి మోడీకి బీహార్ సీఎం లేఖ
పౌరసత్వ సవరణ చట్టంపై మౌనంగా ఉన్నందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను(Nitish Kumar) ఎగతాళి చేస్తూ సీఎం మిస్సింగ్ (Nitish Kumar Missing)అంటూ పాట్నాలో పోస్టర్లు అంటించారు.
Patna, December 17: బీహార్ సీఎం (Bihar Chief Minister)కనిపించడం లేదంటూ రాజధాని పాట్నాలో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టంపై మౌనంగా ఉన్నందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను(Nitish Kumar) ఎగతాళి చేస్తూ సీఎం మిస్సింగ్ (Nitish Kumar Missing)అంటూ పాట్నాలో పోస్టర్లు అంటించారు.
CAB, NRCలపై ఏం మాట్లాడకుండా మౌనం వహిస్తున్న సీఎం నితీష్ కుమార్ కనిపించడం లేదు, అతన్ని అప్పగించన వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము అని ఆ ఫ్లెక్సీపై రాసి ఉంది. మరో పోస్టర్‌పై మూగ, చెవిటి మరియు గుడ్డి ముఖ్యమంత్రి కనిపించడం లేదు..కనిపించడం లేదు.. కనిపించడం లేదు అంటూ రాసి ఉంది.
కాగా పార్లమెంటులో పౌరసత్వ సవరణ బిల్లుకు(Citizenship Amendment Act 2019) మద్దతు ఇచ్చిన ఆర్జేడీ ఎంపీలు ఇప్పుడు జేడీయూ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. నితీష్ కుమార్ NRCకి అనుకూలంగా లేరని, CAAతో ఎటువంటి సమస్యా లేదని అన్నారని జేడీయూ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తెలిపారు. ఈ రెండు కలిపితేనే సమస్య వస్తుందని ఆయన అన్నారు. CABపై తన ఆందోళనను ట్విట్టర్ ద్వారా వెలిబుచ్చిన ప్రశాంత్, నితీష్ వ్యాఖ్యల తర్వాత తన ట్విట్టర్ బయోడెటా నుండి పార్టీ హోదాను తొలగించారు.
'Nitish Kumar Missing' Posters Emerge in Patna:
డిసెంబర్ 11 న రాజ్యసభలో క్యాబ్ ఆమోదించబడటానికి ఒక రోజు ముందు, పార్లమెంటులో బిల్లుకు మద్దతు ఇచ్చే నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని ప్రశాంత్ కిషోర్ సీఎం నితీష్ కుమార్‌ని కోరారు. అయితే ఇది ముందుకు సాగలేదు. ఇదిలా ఉంటే రాజ్యసభ ఆమోదం పొందిన తరువాత, క్యాబ్ డిసెంబర్ 12 న అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ అంగీకారంతో ఒక చట్టంగా మారిన సంగతి విదితమే.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఇంటర్నెట్‌లో అశ్లీల వెబ్‌సైట్లను నిలిపివేయాలని(Porn sites Ban) బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీని (PM Modi)కోరారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను రాశారు. పోర్న్ సైట్లను బ్యాన్ చేయాలని, ఇంటర్నెట్‌లో ఉన్న అర్థరహిత సమాచారాన్ని తొలగించాలని నితీశ్ డిమాండ్ చేశారు. దీర్ఘ కాలం పాటు ఇలాంటి కంటెంట్‌ను చూడడం వల్ల ప్రజల్లో నెగటివ్ మైండ్‌సెట్ కలుగుతోందని, దీని వల్లే మహిళల పట్ల నేరాలు అధికం అవుతున్నాయని నితీశ్ అన్నారు.