Omar Abdullah Takes Oath as J&K CM: జ‌మ్మూకశ్మీర్ ముఖ్య‌మంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం, కేంద్రపాలిత ప్రాంతానికి తొలి సీఎంగా ఒమర్

శ్రీనగర్‌లోని షేర్-ఇ- కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఒమర్ అబ్దుల్లాతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో కేంద్రపాలిత ప్రాంతం జ‌మ్మూకశ్మీర్ కు తొలి ముఖ్య‌మంత్రిగా ఒమర్ అబ్దుల్లా చ‌రిత్ర‌కెక్కారు.

Omar Abdullah Becomes New Jammu and Kashmir CM: National Conference Leader Sworn In As First Chief Minister of Union Territory (Watch Video)

జ‌మ్మూక‌శ్మీర్ సీఎంగా నేషనల్‌ కాన్ఫరెన్స్ పార్టీ అగ్ర‌నేత ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్‌లోని షేర్-ఇ- కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఒమర్ అబ్దుల్లాతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో కేంద్రపాలిత ప్రాంతం జ‌మ్మూకశ్మీర్ కు తొలి ముఖ్య‌మంత్రిగా ఒమర్ అబ్దుల్లా చ‌రిత్ర‌కెక్కారు.

జమ్మూకశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా, కీలక నిర్ణయాన్ని ప్రకటించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా

ఈ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ‌ కార్యక్రమానికి ఇండియా కూట‌మి నేత‌లు విచ్చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఆప్ నేత సంజయ్ సింగ్, ఎన్సీపీ-ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత డీ రాజా హాజరయ్యారు.

Omar Abdullah Becomes New Jammu and Kashmir CM

పదేళ్ల‌ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జ‌మ్మూక‌శ్మీర్ ప్రజలు ఇండియా కూటమికి 90 స్థానాలకు గానూ 49 స్థానాల్లో గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారు. మొదటిసారి ఒంటరిగా అధికారంలోకి రావాలని భావించిన బీజేపీ 29 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సత్తా చాటింది. ఆ పార్టీ ఏకంగా 42 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌కు మాత్రం చేదు ఫలితాలే వచ్చాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో క‌లిసి కేవలం 6 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ విజ‌యం సాధించింది.