‘Omar Abdullah Will Become CM’: జమ్మూకశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా, కీలక నిర్ణయాన్ని ప్రకటించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకున్న ట్రెండ్స్ ప్రకారం మొత్తం 90 స్థానాల్లో 51 చోట్ల కూటమి ఆధిక్యంలో ఉంది.
బీజేపీ 28 చోట్ల లీడ్ లో ఉంది. పీడీపీ 2 స్థానాల్లో, ఇతరులు 9 చోట్ల లీడ్ లో ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం. కాగా జమ్మూకశ్మీర్ లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో, జమ్మూకశ్మీర్ కు కాబోయే ముఖ్యమంత్రి పేరును నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించారు.
తదుపరి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అని ఆయన చెప్పారు. ప్రజలు గొప్ప తీర్పును వెలువరించారని ఆయన కొనియాడారు. మరోవైపు, ఫరూఖ్ అబ్దుల్లా కుమారుడైన ఒమర్ అబ్దుల్లా ఇదివరకే జమ్మూకశ్మీర్ సీఎంగా పని చేశారు. ఇండియా కూటమి అధికారాన్ని చేపట్టబోతున్న నేపథ్యంలో... అబ్దుల్లా నివాసం వద్ద సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.
Here's Tweet
#WATCH | Srinagar, J&K | National Conference chief Farooq Abdullah says, "After 10 years the people have given their mandate to us. We pray to Allah that we meet their expectations...It will not be 'police raj' here but 'logon ka raj' here. We will try to bring out the innocent… pic.twitter.com/j4uYowTij4
— ANI (@ANI) October 8, 2024
పదేళ్ల తర్వాత ప్రజలు ఈ ఎన్నికల్లో తమ తీర్పును తెలియజేశారు. ఆగస్టు 5 నాటి నిర్ణయాన్ని (2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ) తాము అంగీకరించడం లేదని స్పష్టంగా చెప్పారు. ఒమర్ అబ్దుల్లానే తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు మా కూటమి నిరంతరం పోరాడుతుంది’’ అని ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on Oct 08, 2024 02:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

