PM Modi Speech in Lok Sabha: వచ్చే ఎన్నికల్లో మునుపటి రికార్డులు బద్దలు కొట్టుకుంటూ అధికారంలోకి వస్తాం, లోక్‌సభ నుంచి విపక్షాలు వాకౌట్‌, లోక్‌సభలో ప్రధాని మోదీ పూర్తి ప్రసంగం ఇదిగో..

గురువారం సాయంత్రం దీనిపై ప్రధానమంత్రి మోదీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

PM Modi (Photo-ANI)

New Delhi, August 10: కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై (No confidence Motion) లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది. గురువారం సాయంత్రం దీనిపై ప్రధానమంత్రి మోదీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ప్రధాని ప్రసంగిస్తుండగా లోక్‌సభ నుంచి విపక్షాలు వాకౌట్‌ చేశాయి.  ప్రధాని మాట్లాడుతూ మణిపూర్‌పై చర్చ విపక్షాలకు అవసరం లేదు. మణిపూర్‌పై అమిత్‌ షా పూర్తి వివరాలు అందించారు. మేం చర్చకు ఆహ్వానిస్తే.. వారు వెళ్లిపోయారని మోదీ అన్నారు.

విపక్షం ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాసం తమకు ఎప్పటికీ అదృష్టమేనని అన్నారు. ‘‘మేం మరోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి రావాలని విపక్షాలు నిర్ణయించాయి. అందుకే ఈ అవిశ్వాసం తీసుకొచ్చాయి’’ అని మోదీ అన్నారు. తమపై నమ్మకం ఉంచిన కోట్లాది భారతీయులకు కృతజ్ఞతలు మోదీ చెప్పారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొడతామని మోదీ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి అంతర్జాతీయ ఆర్థిక విధానం తెలియదని, ఆ పార్టీకి ఓ విజన్ లేదని, నిజాయతీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో భారత్ పేదరికంలో మగ్గిందన్నారు. 2028లోను తమపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడతాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి భారత వ్యాక్సిన్‌పై, భారత ప్రజల‌పై, భారత ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం లేవన్నారు. విపక్షాలకు పాకిస్థాన్‌పై ప్రేమ కనిపిస్తోందని, ఆ దేశం చెప్పిందే నమ్ముతోందన్నారు. అందుకే పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేశామంటే కాంగ్రెస్ సైన్యాన్ని నమ్మలేదన్నారు.

విపక్షాల నోబాల్స్‌ తో సిక్సర్లు కొడుతున్నాం, లోక్‌సభలో ప్రతిపక్షాలపై మోదీ సెటైర్లు, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకనే అవిశ్వాసం పెట్టారంటూ ఎద్దేవా, విపక్షాల అవిశ్వాసంతో ఈ సారి కూడా అధికారంలోకి వస్తామన్న మోదీ

అందుకే తమిళనాడు ప్రజలు ఎప్పుడో కాంగ్రెస్‌కు నో కాన్ఫిడెన్స్ చెప్పారన్నారు. అలాగే బెంగాల్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, త్రిపుర, ఒడిశా, నాగాలాండ్.. ఇలా పలు రాష్ట్రాల ప్రజలు దశాబ్దాల క్రితమే కాంగ్రెస్‌కు నో కాన్ఫిడెన్స్ చెప్పాయన్నారు. క్రమంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. మేకిన్ ఇండియా అంటే కూడా ఎగతాళి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీకి అహంకారంతో కళ్లు మూసుకుపోయాయన్నారు.

Here's ANI VIdeo

విపక్షాలు ఇండియాను.. I.N.D.I.A. అంటూ ముక్కలు చేశాయన్నారు. విపక్షాలు NDAకు రెండు Iలు చేర్చి I.N.D.I.A.గా మార్చాయని, మొదటి I.. 26 పార్టీల అహంకారానికి, రెండో I.. ఒక కుటుంబ అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రతి పథకం వెనుక కాంగ్రెస్ ఓ కుటుంబం పేరే చేర్చిందన్నారు. విపక్షాలలో ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి కావాలని ఉందన్నారు. కానీ అక్కడ స్కీంలకు బదులు స్కామ్‌లు ఉంటాయన్నారు. తమ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి గాంధీ పేరును వినియోగించుకుందని ఆరోపించారు. విపక్షాలది ఇండియా కూటమి కాదని, అవినీతి కూటమి అన్నారు. కాంగ్రెస్‌కు కుటుంబ పాలన అంటే ఇష్టమన్నారు.

2018లోనూ అవిశ్వాసం పెట్టారని గుర్తు చేస్తూ.. తమ ప్రభుత్వంపై ప్రజలు అనేకసార్లు విశ్వాసం చూపించారన్నారు. క్రికెట్‌ భాషలో చెప్పాలంటే విపక్షాలు వరుస నోబాల్స్‌ వేస్తుంటే.. అధికార పక్షం ఫోర్లు, సిక్సులు కొడుతోందని వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ అన్ని రికార్డులు బద్దలుకొట్టి ఎన్డీయే అధికారంలోకి వస్తుంది. ఇటీవల మా ప్రభుత్వం అనేక కీలక బిల్లులను సభలో ఆమోదించింది.

 సినీ రంగమేమైనా ఆకాశం నుంచి ఊడిపడిందా? చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి, కోట్లకు పడగలెత్తిన కొందరు హీరోలు భుజాలు తడుముకుంటున్నారంటూ ట్వీట్

వీటిపై విపక్షాలకు ఏమాత్రం ఆసక్తి లేదు.‘ దేశ ప్రజల పట్ల విపక్షాలు విశ్వాస ఘాతుకానికి ఒడిగట్టాయి. పేదల గురించి ఆలోచన లేదు. అధికారంలోకి రావడమే వారి పరమావధి. విపక్షాలు మాట్లాడిన ప్రతి మాట దేశమంతా శ్రద్ధగా వింటోంది. ఇప్పటి వరకు దేశాన్ని మీరు నిరాశ, నిస్పృహల్లో ముంచడం తప్ప.. చేసిందేమీ లేదు. విపక్ష నేతలు వాళ్లు తీసుకున్న గోతిలో వారే పడుతున్నారు. ’’ అని మోదీ అన్నారు.

అవిశ్వాస తీర్మానాలు పెట్టి ఏం సాధించారని ప్రధాని మోదీ విపక్షాలను ప్రశ్నించారు. ‘‘ 1999లో శరద్‌ పవార్‌ నాయత్వంలో, 2003, 2018లో సోనియా నేతృత్వంలో అవిశ్వాసం పెట్టారు. ఇన్నిసార్లు అవిశ్వాసాలతో వాళ్లు ఏం సాధించారు. 21వ శతాబ్దం భారత్‌దే. ఈ సమయం భారత్‌కు అత్యంత కీలకం. భారత్‌ స్వప్నాలు సాకారమయ్యే కీలక శతాబ్దమిది. ‘అభివృద్ధి’ మనందరి తారకమంత్రం కావాలి. విభేదాలు, వైరుధ్యాలు దాటి అభివృద్ధి మనందరి లక్ష్యం కావాలి. యువతరం స్వప్నాలు సాకారం చేసి లక్ష్య సిద్ధికి పరుగెడుతోంది.

మణిపూర్‌ హింసపై రాజకీయాలు సిగ్గుచేటు, ప్రతిపక్షాలపై మండిపడిన అమిత్ షా, శాంతి కోసం విజ్ఞప్తి చేసిన కేంద్ర హోం మంత్రి

వారి లక్ష్యాలకు సంపూర్ణ సాకారం అందించాల్సిన బాధ్యత మనది. బీజేపీ అభివృద్ధి దృష్టిని గుర్తించి 2019లో మాకు ఈ దేశం సంపూర్ణ అధికారం ఇచ్చింది. తొమ్మిదేళ్లలో ఒక్క కుంభకోణం చూపించగలరా? సుపరిపాలన అన్నదానికి మేం నిదర్శనంగా నిలిచి గెలుస్తున్నాం. ఆకాశం అంచులు దాటి ఆలోచిస్తున్న యువతకు సంపూర్ణ సహకారం అందిస్తున్నాం. ప్రపంచ యవనికపై భారత్‌ పాత్ర కీలకంగా మారుతోంది. ప్రపంచ అభివృద్ధిలో భారత భాగస్వామ్యం రోజురోజుకూ పెరుగుతోంది. భారత్‌ ఆత్మవిశ్వాసం ప్రపంచానికి మార్గదర్శనంగా నిలుస్తోంది. భారత్‌ ఎంతో బలంగా ఉందనడానికి విదేశీ పెట్టుబడులే నిదర్శనం. పెట్టుబడులకు, అవకాశాలకు భారత్‌ స్వర్గంగా మారుతోంది. అని మోదీ అన్నారు.

భారత్‌లో నిరుపేదలు, అతిపేదలు లేరని ఐఎంఎప్‌ చెబుతోందని మోదీ లోక్‌సభకు తెలిపారు. 37 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఐఎంఎఫ్‌ అధికారికంగా చెప్పిందన్నారు. మరోవైపు పరిశుభ్రత విషయంలో భారత్‌ కృషిని డబ్ల్యూహెచ్‌వో ప్రశంసించిదని చెప్పారు. ‘‘ లక్షల మందిని అంటువ్యాధుల నుంచి రక్షించిన విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో అధికారికంగా పేర్కొంది. భారత్‌లో జరుగుతున్న అభివృద్ధిని ప్రపంచమంతా చూస్తోంది. ఇక్కడున్న విపక్షాలకు మాత్రం అది కనిపించడం లేదు. విపక్షాల కళ్లు అహంకారంతో మూసుకుపోయాయి.

ప్రజలు పేదరికం నుంచి బయటకు రావడం విపక్షాలు చూడలేవు. మూడు రోజులుగా విపక్షాలు వారి మనసులోని అక్కసంతా కక్కేశారు. అందువల్ల వారి మనసు కాస్త తేలికపడి ఉంటుంది. ‘మోదీకి సమాధి కట్టేస్తున్నారు.. మోదీకి సమాధితవ్వుతున్నారంటూ’ అపభ్రంశాలు పలుకుతున్నారు. అమంగళం, అపభ్రంశాలతో మోదీని ఆపలేరు. విపక్షాలకు ఎదుటి వాళ్ల నష్టం కోరుకునే వరం లభించినట్లుంది. మీరు ఎంత నష్టం కోరుకుంటే మాకు అంత లాభం జరుగుతోంది. గత 9 ఏళ్లలో ఇది పదేపదే నిరూపితమైంది.’’ అని మోదీ తెలిపారు.

విపక్షాలు ఎప్పుడూ నిరాశ, నిస్పృహలు వెదజల్లుతుంటాయని మోదీ అన్నారు. ‘‘ దీనికి మొదటి ఉదాహరణ బ్యాంకులు. బ్యాంకులు మునిగిపోతున్నాయి, నాశనమవుతున్నాయంటూ శాపనార్థాలు పెట్టారు. వాటి విషయంలో ఇప్పుడేం జరిగింది. భారతీయ బ్యాంకులన్నీ మరింత బలోపేతమై లాభాల బాట పట్టాయి. విపక్షాలు అది కనిపిస్తుందో? లేదో? హెచ్‌ఏఎల్‌ అస్తిత్వాన్ని ప్రశ్నించారు. ఆ సంస్థ మునిగిపోయింది. రక్షణ పరిశ్రమలు నాశనమయ్యాయి, కార్మికులకు భవిష్యత్‌ లేదు అంటూ అందోళన చేశారు.

ఇప్పుడు హెచ్‌ఏఎల్‌ ఎలా ఉందో మీకు తెలుసా? హెచ్‌ఏఎల్‌ చరిత్రలో అత్యధిక ఆదాయం నమోదు చేసింది. మూడో ఉదాహరణ ఎల్‌ఐసీ.. అది కూడా మునిగిపోతోంది. పేదలకు పెద్దలకు కట్టబెడుతున్నారంటూ ప్రచారం చేశారు. ఎల్ఐసీలోని పేదల సొమ్ముతో పెద్దలను కాపాడుతున్నారంటూ విషప్రచారం చేశారు. స్టాక్‌మార్కెట్‌లో ఎల్ఐసీ విలువ చూసి మాట్లాడండి. మీరు ఏవైతే మునిగిపోతున్నాయని అన్నారో.. అవి అద్భుత ఫలితాలిస్తున్నాయి.’’ అని మోదీ పేర్కొన్నారు.

ప్రతిపక్షాలకు ప్రజల మీద, దేశం మీద, వ్యవస్థల మీద విశ్వాసం లేదని మోదీ విమర్శించారు.‘‘ ఒకసారి ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయికి ఎదుగుతుందో చూడండి. అతి త్వరలోనే ప్రపంచంలో భారత్‌ మూడో ఆర్థికశక్తిగా ఎదుగుతుంది. మేం తప్పులు చేస్తున్నామంటున్నారు కదా.. విపక్షాలుగా మీరేం చేస్తున్నారు. మేము తప్పు చేస్తే.. సరైన దిశానిర్దేశం చేసే బాధ్యత విపక్షాలకు లేదా? మేం చేసే పనుల్లో తప్పులుంటే సూచనలు సలహాలు ఇచ్చే బాధ్యత మీకు లేదా? మేం ఏమీ చేయకుండానే భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందా? కాంగ్రెస్‌కు ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఆలోచన లేదు.. అంత స్థాయి కూడా లేదు. ప్రతిదాన్ని విమర్శించడం తప్ప.. ఆర్థిక వ్యవస్థ పట్ల, దేశం పట్ల కాంగ్రెస్‌కు దిశదశ లేదు.’’ అని మోదీ అన్నారు.

1991లో భారత్‌.. అప్పుల కోసం ప్రపంచం వైపు చూసిందని మోదీ అన్నారు. 2014 తర్వాత స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా నిలదొక్కుకుందన్నారు. ‘‘ రిఫార్మ్‌, పెర్‌ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌ అనే పద్ధతిలో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాం. మా పనితీరు, నిబద్ధతతోనే దేశాన్ని మూడో ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టి తీరుతాం. డిజిటల్‌ ఇండియా గురించి మాట్లాడినప్పుడు, జన్‌ధన్‌ గురించి మాట్లాడినప్పుడు అవహేళన చేశారు. డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ ఏ స్థాయికి వెళ్లిందో మన కళ్లెదుటే కనబడుతోంది.

విపక్షాలకు ఆత్మ విశ్వాసం ఉండదు. దేశీయులను నమ్మరు. మన వ్యవస్థలకన్నా, మన సైన్యం కన్నా పాకిస్థాన్‌ చెప్పే మాటలపైనే విపక్షాలకు విశ్వాసం ఎక్కువ. భారత్‌పై వచ్చే వ్యతిరేక ప్రచారానికే ప్రతిపక్షాలు ఎక్కువ విలువిస్తాయి. భారత్ సామర్థ్యం మీద.. భారత ప్రజల సామర్థ్యం మీద విపక్షాలకు విశ్వాసం లేదు. అహకంకారంతో కాంగ్రెస్‌ కళ్లు మూసుకుపోయాయి. వాస్తవికతను జీర్ణించుకునే పరిస్థితుల్లో లేరు.’’ అని మోదీ మండిపడ్డారు