New Delhi, AUG 10: విపక్షాలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ఆయన ప్రభుత్వం మీద విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై (Modi on No confidence Motion) గురువారం లోక్సభకు హాజరైన మోదీ.. విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని తమ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశ పెట్టారంటూ ఎద్దేవా చేశారు. అవిశ్వాస తీర్మానం ప్రభుత్వానికి ఫ్లోర్ టెస్ట్ కాదని, అది విపక్షాలకు ఫ్లోర్ టెస్టని అన్నారు. విపక్షాల అవిశ్వాస ప్రస్తావన తమకు ప్రయోజనకరమని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో తమపై అవిశ్వాసం పెట్టారని, అయితే అది ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీని ఇచ్చిందని మోదీ (Prime Minister Narendra Modi) అన్నారు. విపక్షాలు గ్రౌండ్ తయారు చేసి ఫీల్డింగ్ తయారు చేసిందని, కానీ ఆట మాత్రం ప్రభుత్వం వైపు నుంచి నడుస్తోందని, సిక్సర్లు తాము కొడుతున్నామని మోదీ అన్నారు. అవిశ్వాస తీర్మానంపై విపక్షాలన్నీ నో బాల్స్ వేస్తున్నాయని ఎద్దేవా చేశారు.
#WATCH | PM Narendra Modi says, "God is very kind and speaks through some medium...I believe that it's the blessing of God that opposition has brought this motion. I had said during the no-confidence motion in 2018 that it was not a floor test for us but a floor test for them… pic.twitter.com/GHysTGoUP6
— ANI (@ANI) August 10, 2023
వాస్తవానికి విపక్షాలు సబ్జెక్ట్ మీద సరిగా ప్రిపేర్ అయి రాలేదని, తాను ఐదేళ్లు అవకాశం ఇచ్చినప్పటికీ వారు ఏమాత్రం వినియోగించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిందని మోదీ అన్నారు. ఆయనను విపక్ష నేతను చేసినప్పటికీ మాట్లాడడానికి కనీసం అవకాశమే ఇవ్వలేదని దుయ్యబట్టారు.
#WATCH | PM Narendra Modi says, "...If Congress says that everything will happen on its own, it means Congress has neither policy nor intention or vision or understanding of global economic system or India's economic world's strength... pic.twitter.com/hr5HE0lESX
— ANI (@ANI) August 10, 2023
‘‘సభలో బిల్లులన్నీ ఆమోదం పొందాయి. డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు దేశంలోని యువశక్తికి కొత్త దిశానిర్దేశం, స్థితిని అందించే బిల్లు. అది కూడా పట్టించుకోరా? భవిష్యత్తు సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. డేటాను రెండవ బంగారంగా పరిగణిస్తారు. దానిపై తీవ్రమైన చర్చ అవసరం. అయితే మీకు (విపక్షాలు) రాజకీయాలే ప్రధానం. గ్రామాల్లో పేదల సంక్షేమం కోసం అనేక బిల్లులు వచ్చినా ఆసక్తి చూపడం లేదు. అధిర్ రంజన్ చౌదరిని ఇక్కడ విపక్ష నేతను చేశారు. కానీ ఆయనను ప్రజా సమస్యలపై కాకుండా వారి రాజకీయాల కోసం వాడుకుంటున్నారు’’ అని మోదీ అన్నారు.
#WATCH | PM Narendra Modi says, "When we say that we will make our economy the third largest economy in the next 5 years, a responsible opposition would have asked questions as to how will we do it but 'Yeh bhi mujhe hi sikhana pada raha hai'. pic.twitter.com/xaxEocauHN
— ANI (@ANI) August 10, 2023
కొన్ని ప్రతిపక్ష పార్టీలకు, దేశం కంటే పెద్ద పార్టీ ఉందని తమ పిచ్చి, ప్రవర్తనతో నిరూపించాయని మోదీ అన్నారు. ‘‘పేదల ఆకలి గురించి మీరు చింతించరు. మీ హృదయమంతా అధికార దాహమే. దేశ యువత భవిష్యత్తు గురించి మీరు పట్టించుకోవడం లేదు. మీ రాజకీయ భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందుతున్నారు. మీరు సమావేశమయ్యారు. సభను ఒక రోజు పని చేయడానికి కూడా అనుమతించలేదు. ఏ ప్రయోజనం కోసం? మీరు ఏకమైతే అవిశ్వాస తీర్మానంపై ఏకం అవుతారు’’ అని అన్నారు.
#WATCH | PM Narendra Modi says, "Vipaksh ke logon ko ek secret vardaan mila hua hai ki jiska bhi yeh log bura chahenge uska bhala hi hoga.' One such example is standing before you. '20 saal ho gaye kya kuch nahi hua par bhala hi hota gaya.." pic.twitter.com/uT8vjtHvSC
— ANI (@ANI) August 10, 2023
‘‘దేశం మిమ్మల్ని గమనిస్తోందని మర్చిపోవద్దు. మీ ప్రతి మాట వింటున్నాను. ప్రతిసారీ మీరు దేశానికి నిరాశ మాత్రమే ఇచ్చారు. ప్రతిపక్షాల వైఖరి గురించి ఏం చెప్పాలి? సొంత ఖాతాలు చెడగొట్టుకున్న వారు మన ఖాతాలను కూడా మా దగ్గరే తీసుకుంటారు. ఈ అవిశ్వాస తీర్మానంలో కొన్ని విషయాలు ఎప్పుడూ చూడని, ఊహించని విధంగా వింతగా కనిపించాయి. దేశంలో అతిపెద్ద పార్టీ పేరు స్పీకర్ల జాబితాలో లేదు. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వంపై శరద్ పవార్ నాయకత్వంలో అవిశ్వాస తీర్మానం వచ్చింది. 2018లో ఖర్గే ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన నాయకత్వం వహించారు. అయితే ఈసారి అధీర్ రంజన్ చౌదరికి మాట్లాడేందుకు కూడా అనుమతి రాలేదు’’ అని అన్నారు.