Assembly Elections 2023: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఇవిగో, నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం

నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ 1వ వారం మధ్య 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 8, 10 తేదీల మధ్య ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి.

Election Commission of India. (Photo Credit: Twitter)

New Delhi, Oct 6: దేశంలోని అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనుంది. నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ 1వ వారం మధ్య 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 8, 10 తేదీల మధ్య ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి.

నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7వ తేదీల మధ్య ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు సమాచారం.2018లో వీటికి చివరి సారిగా ఎన్నికలు జరిగాయి. సరిగ్గా 5 ఏళ్ల తరువాత 2023 ఏడాది చివర్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆపద్ధర్మంగా మారనున్నాయి.

కీలక వడ్డీ రేట్లు యథాతథం.. 6.50% వద్ద యథాతథంగా రెపో రేటు.. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయం

రాజస్థాన్, మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్ లకు ఒకే సారి పోలింగ్ నిర్వహించి, ఛత్తీస్ గఢ్(Chattisgarh) కి రెండు విడతల్లో పోలింగ్ జరపనున్నట్లు సమాచారం. తెలంగాణ(Telangana), రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ శాసనసభల పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో ముగుస్తుంది. మిజోరాం(Mizoram) శాసన సభ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 17తో ముగుస్తుంది.

చత్తీస్ ఘడ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12 నుంచి 20 వతేదీల మధ్య, మధ్యప్రదేశ్, మిజోరం ఎన్నికలు నవంబర్ 28వ తేదీన, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికలు డిసెంబర్ 7వ తేదీన నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం ఐదు రాష్ట్రాలకు పోలింగ్ తేదీలు వేర్వేరుగా ఉండవచ్చు. అక్టోబర్ 10 నుంచి 15వ తేదీల మధ్య ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది.

అక్టోబ‌ర్ 10 వ‌ర‌కూ ఈడీ క‌స్ట‌డీకి ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్‌, చావనైనా చస్తాను కానీ, తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన రాజ్య‌స‌భ

కాగా ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వాలు అధికారంలో ఉండగా.. మిజోరంలో బీజేపీ(BJP) మిత్రపక్షమైన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) అధికారంలో ఉంది. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి నేతృత్వంలోని కేసీఆర్ సర్కార్, మధ్యప్రదేశ్(Madya Pradesh) లో బీజేపీ సర్కార్ రూలింగ్ లో ఉన్నాయి.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ముందు ఆయా ప్రాంతాల్లో ఎన్నికల సన్నద్ధతను ఈసీ పరిశీలించింది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు శుక్రవారం పరిశీలకుల బృందం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికలను 2024 లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి.

ఇప్పటికే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఆయా ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తుండగా.. బీజేపీ సైతం స్పీడ్ పెంచింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తదితర సీనియర్ నేతలు వరుసపెట్టి సభలు నిర్వహిస్తూ ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేస్తున్నారు.



సంబంధిత వార్తలు