Prasanth Kishore: పదో తరగతి పాస్‌ అయితే బీహార్ సీఎం, సీఎం నితీశ్‌ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్

ఇటీవలే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్, జన్ సురాజ్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.

Prashant Kishor slams Bihar CM Nitish Kumar, people do not want 10 fail leadership(X)

Bihar, Aug 5: అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పార్టీ విధివిదానాలను ప్రకటించనున్నారు ప్రశాంత్. గతంలో నితీశ్ కుమార్‌తో జేడీయూలో పనిచేసి తర్వాత బయటికొచ్చిన ప్రశాంత్...ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు.

తాజాగా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు ప్రశాంత్ కిషోర్. తమ రాష్ట్రానికి పదవ తరగతి ఫెయిల్ అయిన నాయకత్వం అవసరమే లేదని చురకలు అంటించారు. చాలా మంది రాజకీయాలలోకి రావాలంటే కోట్లు ఖర్చుపెట్టాలని అనుకుంటున్నారని కానీ తాను వచ్చాక అవేమి అవసరం లేదని తేల్చిచెబుతున్నారు.

జన్ సురాజ్ పార్టీ ఆదర్శ భావాలు కలిగిన యువకుల కోసమేనని, రాజకీయ వ్యవస్థలోనే సరికొత్త ఒరవడి క్రియేట్ చేస్తామని చెప్పారు. నేటి యువకులు రాజకీయాల పట్ల శ్రద్ధ వహించడం లేదని.. యువత తప్పనిసరిగా రాజకీయాలలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అన్ని రాజకీయ పార్టీల మాదిరిగా తమ పార్టీ ఉండదని, కనీస విద్యార్హతలు ఉన్న వారికే పార్టీలో ప్రాతినిధ్యం కల్పిస్తామని అంటున్నారు. బీహార్‌లో దారుణం, తాగిన మత్తులో కారులోకి బాలికను లాగి అత్యాచారం చేయబోయిన పోలీస్ అధికారి, బాలిక సహాయం కోసం అరవడంతో..

2014 నుండి దేశంలో వినిపిస్తున్న పేరు ప్రశాంత్ కిషోర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2019లో జగన్, తర్వాత మమతా బెనర్జీలకు అధికారాన్ని కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో జగన్‌కు ఘోర పరాభవం తప్పదని చెప్పినట్లుగానే వైసీపీ ఓటమి పాలైంది. మమతా బెనర్జీ సీఎంను చేసి ఆ తర్వాత రాజకీయ వ్యూహకర్త పదవి నుండి తప్పుకున్నారు.



సంబంధిత వార్తలు

RS Praveen Kumar: పోలీసుల ఆత్మహత్యలపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక సూచన, ఇలా చేస్తే ఆత్మహత్యలను ఆపవచ్చు..మానసిక ఒత్తిడిని అధిగించాలంటే ఇలా చేయండన్న ఆర్‌ఎస్పీ

CM Revanth Reddy: ప్రజలకు అందుబాటులో ఉండండి..పాత, కొత్త నాయకులు అంతా కలిసి పనిచేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్ త్వరలో వెల్లడిస్తానన్న ముఖ్యమంత్రి

Hyderabad Metro Expansion: మేడ్చల్ టూ శామీర్‌ పేట..మెట్రో విస్తరణ, సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర కానుక,మూడు నెలల్లో డీపీఆర్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు

Maoist Tarakka Surrendered: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ, కేంద్ర కమిటీ సభ్యుడు వేణుగోపాల్ భార్య తారక్క లొంగుబాటు, మహారాష్ట్ర సీఎం ఎదుట మరో 10 మందితో పాటూ జనజీవనస్రవంతిలోకి మావోయిస్టులు