Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నిక.. తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్‌కు దూరంగా నలుగురు ఎమ్మెల్యేలు, ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీలో 173 మంది ఎమ్మెల్యేలు, తెలంగాణలో 117 మంది ఎమ్మెల్యేలు
ఇక తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
Hyd, July 18: రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఏపీలో 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 151 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి ( Balakrishna, Butchaiah Chowdary) తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
మొత్తం 119 ఎమ్మెల్యేలలో 117 మంది ఓటేశారు. మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ (Chinnamaneni Ramesh, Gangula Kamalakar) తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఈ నెల 21న ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు. 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏపీకి చెందిన కందుకూరు వైస్సార్‌సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీదర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఓటు వేశారు. తెలంగాణలో మొదటగా మంత్రి కేటీఆర్ ఓటేశారు. ఇక విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆరెస్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది.
ఇక ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ధన్కర్ అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన ఉపరాష్ట్రపతి అవుతాడని తనకు ఖచ్చితంగా తెలుసన్నారు.