'RajDharma' Row: వాజ్ పేయినే లెక్క చేయలేదు..మీకు మేమెంత, రవి శంకర్ ప్రసాద్‌కి కౌంటర్ విసిరిన కపిల్ సిబాల్, అధికార, ప్రతిపక్షాల మధ్య వేడెక్కిన ‘రాజధర్మ’ వార్

కాంగ్రెస్‌ హయాంలో రాజధర్మాన్ని పాటించామని అన్ని వర్గాల ప్రజలను రక్షించామని ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చుకు కారణమయ్యాయి. తాజాగా కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు (Ravi Shankar Prasad) కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ (Kapil Sibal) సిబాల్ శనివారం కౌంటర్ ఇచ్చారు.

Raj dharma is not one of your government’s strong points’: Kapil Sibal hits out at Ravi Shankar Prasad , BJP (Photo-Facebook)

New Delhi, March 01: ‘రాజధర్మం’ (Raj Dharma Row) అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చు రాజేసింది. కాంగ్రెస్‌ హయాంలో రాజధర్మాన్ని పాటించామని అన్ని వర్గాల ప్రజలను రక్షించామని ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చుకు కారణమయ్యాయి. తాజాగా కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు (Ravi Shankar Prasad) కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ (Kapil Sibal) సిబాల్ శనివారం కౌంటర్ ఇచ్చారు.

ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్ నిజనిర్థారణ కమిటీ

‘‘గుజరాత్ (Gujarat) విషయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ (Vajpayeeji) మాటలనే మీరు పెడచెవిన పెట్టారు. ఇక, మా మాటలను ఎందుకు వింటారు’’ అని సిబల్ ఎద్దేవా చేశారు. వినడం, నేర్చుకోవడం, ఆచరించడం రాజధర్మంలో (Raj dharma) భాగమని, ఇవేవీ కేంద్ర ప్రభుత్వం అనుసరించడం లేదని కపిల్ సిబాల్ విమర్శించారు.

కాగా ఈశాన్య ఢిల్లీలో మతపరమైన అల్లర్లను అదుపుచేయడంలోనూ, తన విధులను నిర్వర్తించడంలోనూ విఫలమైన కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సోనియా నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రపతి కోవింద్‌కు ఓ వినతిపత్రం అందజేశారు.

Here's  Kapil Sibal Tweet

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) తన విద్యుక్త ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించలేదని, తక్షణమే ఆయనను తప్పించి, కేంద్రానికి రాజ ధర్మాన్ని గుర్తు చేయాలని సోనియా బృందం (Sonia Gandhi-led party) కోరింది.

42కి చేరిన మృతుల సంఖ్య, షాక్ నుంచి ఇంకా తేరుకోని ఈశాన్య ఢిల్లీ వాసులు

దీనిపై కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ అంతే ఘాటుగా బదులిచ్చారు. ‘‘సోనియా గాంధీ గారు.... మీరు మాకు రాజధర్మాన్ని ప్రవచించాల్సిన అవసరం లేదు. మీ పాలన మొత్తం రాజధర్మాన్ని ఉల్లంఘించే విధంగానే నడిచింది. కాంగ్రెస్ తన ముఖాన్ని ‘రాజధర్మ’ అనే అద్దంలో చూసుకోవాలి’ అని విమర్శించారు. తాజాగా రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ కౌంటర్ వేసారు.

ఢిల్లీకి కొత్త పోలీస్‌ కమిషనర్‌, అల్లరి మూకల పని పట్టనున్న ఎస్ఎన్ శ్రీవాస్తవ

కాగా ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.. సత్యేందర్‌ జైన్‌ దాడిలో గాయపడిన వ్యక్తులను జీటీబీ ఆస్పత్రికి చేరుకొని పరామర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని కలిసి, వారితో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ఇప్పటికీ 45 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు.

వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. వారి పరిస్థితి నిలకడగానే ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. వారి పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు.