![](https://test1.latestly.com/wp-content/uploads/2020/02/Delhi-Police-380x214.jpg)
New Delhi, February 28: దేశ రాజధానిలో జరిగిన అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య 42కి (Delhi violence death toll) చేరింది. 350మందికి పైగా గాయపడ్డారని వైద్యులు ప్రకటించారు. ఆదివారం రాత్రి నుంచి సీఏఏ (CAA) అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈశాన్య ఢిల్లీని (North East Delhi) అల్లరిమూక సర్వనాశనం చేశారు. బ్రిపూర్ కార్ పార్కింగ్ ఏరియా మొత్తం ధ్వంసమైంది.
ఢిల్లీకి కొత్త పోలీస్ కమిషనర్, అల్లరి మూకల పని పట్టనున్న ఎస్ఎన్ శ్రీవాస్తవ
పరిస్థితులను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు పోలీసుల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా అల్లర్ల ప్రాంతంలో పోలీసులు పర్యటించారు. పరిస్థితులను సమీక్షించారు. ఢిల్లీ పోలీస్ చీఫ్ ఎస్ఎన్ శ్రీవాస్తవ నేతృత్వంలోని పోలీసు బృందాలు హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి.. స్థానికులకు ధైర్యం చెప్పాయి.
ఢిల్లీలో పరిస్థితి కుదుటపడుతోందని, అనవసర వదంతులను ఎవరూ నమ్మవద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) అన్నారు. నేడు ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు.
ఢిల్లీలో నేడు 10 గంటల పాటు కఠిన చట్టాల్ని అమలు చేస్తున్నట్లు.. ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గుంపులుగా ఉండరాదని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
కేంద్రం, ఢిల్లీ పోలీసులు 4 వారాల్లో బదులివ్వాలన్న ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ లెఫ్టినెంట్-గవర్నర్ అనిల్ బైజల్ (Anil Baijal) ఈశాన్య జిల్లాలో హింస బాధిత ప్రాంతాలను సందర్శించనున్నారు. సీనియర్ ఐపిఎస్ అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవకు ప్రభుత్వం శుక్రవారం ఢిల్లీ పోలీస్ కమిషనర్ అదనపు బాధ్యతలు ఇచ్చింది. ఈ నిర్ణయం మార్చి 1 నుండి అమల్లోకి వస్తుంది మరియు ప్రస్తుత అముల్య పట్నాయక్ శనివారం పదవీ విరమణ చేయడంతో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయనే ఆ స్థానంలో ఉంటారు.
జాఫ్రాబాద్, మౌజ్‌పూర్, గోకుల్‌పురితో సహా పలు ప్రాంతాలు శుక్రవారం కూడా ఉద్రిక్తంగా ఉన్నాయి. పోలీసులు మరియు పారా మిలటరీ దళాలను భారీగా మోహరించడంతో ఈ ప్రాంతాల్లో భద్రత కఠినంగా ఉంది. ఈశాన్యంలో హింసాకాండలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక్కొక్కరికి రూ .10 లక్షలు ప్రకటించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఏ ఆప్ సభ్యుడైనా చట్టంలో నిర్దేశించిన శిక్ష కన్నా రెట్టింపు శిక్ష పొందేలా చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ముఖ్యమంత్రి అన్నారు.
మా వాళ్లు ఉంటే రెండింతలు శిక్ష వేయండి
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. సీఏఏ అనుకూల, వ్యతిరేకుల మధ్య తలెత్తిన వివాదం అల్లర్లుగా మారింది. ఈ అల్లర్లపై నమోదైన వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు పిటిషన్‌ను నాలుగు వారాలకు వాయిదా వేసింది.