Rajasthan Assembly Session 2020: బలపరీక్షకు సిద్ధమైన రాజస్థాన్ సీఎం, అశోక్ గెహ్లాట్‌కు షాకిచ్చిన బీఎస్‌పీ, సీఎం గెహ్లాట్‌తో భేటీ అయిన సచిన్ పైలట్, నేటి నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు
రాజస్థాన్ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు (Rajasthan Assembly Session 2020) ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై (CM Ashok Gehlot Govt) అవిశ్వాసం పెట్టాలని బీజేపీ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. అయితే, ఇందుకు ప్రతిగా తామే విశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ట్విస్ట్ ఇచ్చింది. అశోక్ గెహ్లాట్ నాయకత్వం మీద తిరుగుబాటు చేసిన సచిన్ పైలెట్ వర్గం (19 మంది ఎమ్మెల్యేలు) మళ్లీ కాంగ్రెస్ (Congress) గూటికి చేరింది. దీంతో కథ సుఖాంతమైందని అంతా భావించారు. అనూహ్యంగా అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మీద అవిశ్వాసం అంటూ బీజేపీ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ కూడా దానికి కౌంటర్‌గా విశ్వాస తీర్మానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.
Jaipur, Augusst 14: రాజస్థాన్ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు (Rajasthan Assembly Session 2020) ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై (CM Ashok Gehlot Govt) అవిశ్వాసం పెట్టాలని బీజేపీ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. అయితే, ఇందుకు ప్రతిగా తామే విశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ట్విస్ట్ ఇచ్చింది. అశోక్ గెహ్లాట్ నాయకత్వం మీద తిరుగుబాటు చేసిన సచిన్ పైలెట్ వర్గం (19 మంది ఎమ్మెల్యేలు) మళ్లీ కాంగ్రెస్ (Congress) గూటికి చేరింది. దీంతో కథ సుఖాంతమైందని అంతా భావించారు. అనూహ్యంగా అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మీద అవిశ్వాసం అంటూ బీజేపీ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ కూడా దానికి కౌంటర్‌గా విశ్వాస తీర్మానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నామని బీజేపీ (BJP) శాసనసభాపక్ష భేటీ అనంతరం అసెంబ్లీలో విపక్ష నేత గులాబ్ చంద్ కటారియా ప్రకటించారు. రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉంది. ఇవన్నీ అసెంబ్లీలో లేవనెత్తుతామని అన్నారు. అసెంబ్లీలో శుక్రవారమే అవిశ్వాస తీర్మానం (confidence motion) పెడతామని రాజస్తాన్ బీజేపీ చీఫ్ సతిశ్ పూనియా తెలిపారు. ‘గెహ్లట్ సర్కారు కోమాలో ఉంది. ప్రభుత్వం స్థిరంగా లేదు. రాష్ట్రంలో అభివృద్ధి పనులన్నీ ఆగిపోయాయి. అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించామని బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ పేర్కొన్నారు. వెనక్కి తగ్గిన సచిన్ పైలట్, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ, సొంతగూటికి కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజస్థాన్‌లోని ఆరుగురు ఎమ్మెల్యేలకు బహుజన్ సమాజ్ పార్టీ (BSP) విప్ జారీ చేసింది. విధానసభపై విశ్వాస ఓటు సందర్భంగా లేదా అసెంబ్లీలో మరే ఇతర చర్యల సందర్భంగా కాంగ్రెస్ సిఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయవద్దని బిఎస్పి తన ఆరుగురు ఎమ్మెల్యేలను కోరింది.ఇదిలా ఉంటే కాంగ్రెస్‌లో చేరేందుకు బీఎస్పీని విడిచిపెట్టిన ఆరుగురు ఎమ్మెల్యేల కేసు విచారణ శుక్రవారం ఉదయం రాజస్థాన్ హైకోర్టులో జరగాల్సి ఉంది.
రాజస్తాన్ కాంగ్రెస్‌లో గత నెల రోజులుగా నెలకొన్న సంక్షోభానికి పుల్ స్టాప్ పెడుతూ.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, తిరుగుబాటు నేత సచిన్ పైలట్ (Sachin Pilot) కలసిపోయారు. గెహ్లాట్ అధికారిక నివాసంలో గురువారం పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, అవినాశ్ పాండే, రణ్‌దీప్ సూర్జెవాలా, అజయ్ మాకెన్‌ల సమక్షంలో ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి ముందు ఈ భేటీ జరిగింది. పైలట్‌తో పాటు వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌లపై విధించిన సస్పెన్షన్‌ను కూడా పార్టీ ఎత్తి వేసింది. సొంత గూటికి తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఆగస్టు 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారని ఆరోపిస్తూ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, వారి సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండే గురువారం ట్వీట్ చేశారు. సీఎం గెహ్లాట్‌పై తిరుగుబాటు చేసి.. పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తూ జూలై 14న జరిగిన సీఎల్పీ భేటీకి హాజరుకాకపోవడంతో నాడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న పైలట్‌ను, పర్యాటక మంత్రిగా ఉన్న విశ్వేంద్ర సింగ్‌ను పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. పైలట్‌ను పీసీసీ చీఫ్ పదవి నుంచి సైతం తొలగించారు. తనతో పాటు తిరుగుబాటు చేసిన 18 మంది ఎమ్మెల్యేలను పైలట్ గురుగ్రామ్‌లోని ఒక హోటల్‌లో ఉంచారు.
తదనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో భేటీ అయిన అనంతరం మళ్లీ పార్టీ గూటికి పైలట్ తిరిగొచ్చారు. పైలట్ వర్గం ఎమ్మెల్యేలు కూడా జైపూర్ తిరిగి వచ్చారు. గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు జైసల్మేర్ నుంచి జైపూర్ వచ్చి, ఇక్కడి ఫెయిర్‌మాంట్ హోటల్‌లో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలో అపార్థాలు చోటు చేసుకుంటూనే ఉంటాయని, వాటిని క్షమించి మరచిపోయి, ముందుకు సాగుతూ ఉండాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ‘నెల రోజులుగా కొన్ని అపార్థాలు చోటు చేసుకున్నాయి. దేశం, రాష్ట్రం, ప్రజాస్వామ్యం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాటిని క్షమించి, మరచిపోయి, ముందుకు సాగాలి’ అని గెహ్లాట్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రమాదకర ఆట దేశంలో సాగుతోందని బీజేపీపై విమర్శలు చేశారు. ‘దేశవ్యాప్తంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలను ఒకటొకటిగా కూల్చే కుట్ర జరుగుతోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్, అరుణాచల్‌లలో అదే జరిగింది. ఈడీ, సీబీఐ, ఐటీ, న్యాయవ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు’ అని వరుస ట్వీట్లు చేశారు.
200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 72 మంది సభ్యుల బలం ఉంది. మిగిలిన వారు ఇతర పార్టీలకు చెందిన వారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)