Rajasthan Political Crisis: వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయండి, రాజ్‌భవన్‌ని ముట్టడించిన రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ఇప్పటికే అసమ్మతి ఎమ్మెల్యేల నోటీసు విషయం సుప్రీం వరకు వెళ్లింది. అక్కడ గెహ్లాట్ సర్కారుకు (Ashok Gehlot Govt) ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, గవర్నర్‌ను ( Governor Kalraj Mishra) కలిసేందుకు జైపూర్‌లోని ఆయన నివాసమైన రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే ఆయన వెనుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.

Rajasthan Congress MLAs at Raj Bhawan. (Photo Credit: ANI)

Jaipur, July 24: రాజస్తాన్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు (Rajasthan Political Crisis) చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే అసమ్మతి ఎమ్మెల్యేల నోటీసు విషయం సుప్రీం వరకు వెళ్లింది. అక్కడ గెహ్లాట్ సర్కారుకు (Ashok Gehlot Govt) ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, గవర్నర్‌ను ( Governor Kalraj Mishra) కలిసేందుకు జైపూర్‌లోని ఆయన నివాసమైన రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే ఆయన వెనుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ కేంద్రం ఒత్తిడికి లొంగిపోయాడు, తాడో పేడో తేల్చుకుంటామని తెలిపిన ఆశోక్ గెహ్లాట్, సుప్రీంకోర్టులో పైలెట్ వర్గానికి ఊరట, కేంద్రంపై విరుచుకుపడిన రాజస్థాన్ సీఎం

అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్‌తో ముఖ్యమంత్రి సమావేశం జరుపుతున్న సమయంలో రాజ్‌భవన్ ముందు బైటాయించిన (Rajasthan Congress MLAs Protest) కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ‘అశోక్ గెహ్లాట్ జిందాబాద్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు సచిన్ పైలెట్, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలంటూ ('House Bulao, Call The Assembly') నినదించారు. స్పీకర్ సీపీ జోషి వేసిన అనర్హత వేటు సరైనదేనని అన్నారు. రాజ్‌భవన్ ఎదుట ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన నిరసన ఇప్పుడు రాజస్థాన్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Here's the video of Congress MLAs raising slogans: 

సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన విజ్ఙప్తిని గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా తిరస్కరించడంతో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. రాజ్‌భవన్‌ను ఎవ్వరైనా ముట్టడించే అవకాశం ఉందంటూ హింట్ ఇచ్చిన అశోక్ గెహ్లట్ తానే ఆ పని చేశారు. తనకు మద్దతు పలుకుతోన్న ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌ను ముట్టడించారు. ఫలితంగా రాజ్‌భవన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు అశోక్ గెహ్లాట్ గవర్నర్‌ను కలిశారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చడం సాధ్యం కాదని గవర్నర్ తేల్చి చెప్పారు. గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడం పట్ల అశోక్ గెహ్లాట్ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే గవర్నర్ అసెంబ్లీ భేటీకి అనుమతి ఇవ్వట్లేదని ఆరోపించారు.

అనంతరం మళ్లీ ఆయన మధ్యాహ్నం 3 గంటల రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. హోటల్‌లో ఉంటోన్న తన అనుకూల ఎమ్మెల్యేలతో కలిసి అశోక్ గెహ్లాట్ నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. తన బలాన్ని ప్రదర్శించారు. అసెంబ్లీని సమావేశ పర్చాలంటూ శాసనసభ్యులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారని గవర్నర్‌కు వివరించారు. వారి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.