Rajasthan CM Ashok Gehlot (Photo Credits: ANI)

Jaipur, July 24: రాజస్తాన్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు (Rajasthan Political Game) చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ (CM Ashok Gehlot) తాజాగా కేంద్రంపైన, గవర్నర్ పైన ఆరోపణలు గుప్పించారు. కేంద్రం ఒత్తిడి కారణంగానే గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా (Kalraj Mishra) తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని ఆరోపించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ప్రభుత్వాలను కూల్చిన విధంగానే రాజస్తాన్‌లో కూడా బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధంగా ఉన్నామని.. ఎవరి బలమెంతో అక్కడే తేలుతుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో సచిన్‌కు ఊరట, స్పీకర్ జోషి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని తెలిపిన కపిల్ సిబల్

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా ఉన్నారని మెజారిటీ నిరూపించుకుని తీరతామని ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా కొంతమంది అసంతృప్త నేతలు కూడా అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందని అశోక్‌ గెహ్లాట్ అభిప్రాయపడ్డారు. కేంద్రం నుంచి ఒత్తిడి వస్తున్న కారణంగానే గవర్నర్‌ తమను కలిసేందుకు అనుమతి ఇవ్వలేదన్న ఆయన.. రాజ్‌భవన్‌ను ప్రజలు ముట్టడిస్తే తాము బాధ్యత వహించబోమన్నారు.

ANI Tweet:

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధమైపోయారు. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ముందు ఎమ్మెల్యేలతో బల నిరూపణకు దిగనున్నారు. తమ ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌లో సీఎం పరేడ్ నిర్వహించునున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం గవర్నర్ మిశ్రాను అశోక్‌ గెహ్లాట్ సమయం కూడా కోరారు. దీంతో రాజ్‌భవన్ 12:30 గంటలకు ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్కు సమయం ఇచ్చింది. ఈ భేటీలోనే తాను బలపరీక్షకు సిద్ధమని, అందుకు తమను అసెంబ్లీని సమావేశపరచాలని సీఎం కోరతారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

ANI Tweet:

అశోక్‌ గెహ్లాట్ సర్కారుపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన సచిన్‌ పైలట్ (Sachin Pilot) సహా 19 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి హాజరుకానందున శాసనసభ స్పీకర్‌ అనర్హత నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పైలెట్ వర్గం హైకోర్టుకు వెళ్లగా వారికి ఊరట లభించింది. శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్‌ను ఆదేశించింది. ఈ విషయంలో సంయమనం పాటించాలని పేర్కొంటూ.. యథాతథ స్థితిని (స్టేటస్‌ కో) కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్యంగా చేర్చాలన్న తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ వాదనతో అత్యున్నత ధర్మాసనం ఏకీభవించింది. స్వీకర్‌ జారీచేసిన అనర్హత నోటీసులపై శుక్రవారం విచారణ ప్రారంభించిన న్యాయస్థానం సచిన్‌ పైలట్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు అనుమతినిచ్చింది.