Jaipur, July 23: సుప్రీం కోర్టులో తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు ఊరట లభించింది. స్పీకర్ సీపీ జోషి (Speaker CP Joshi) పిటిషన్ విచారణ సందర్భంగా.. అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ పైలట్‌తో పాటు అసంతృప్త ఎమ్మెల్యేల పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేయకుండా రాజస్థాన్ హైకోర్టును (Rajasthan High Court) నిలువరించలేమని సుప్రీం (Supreme Court) స్పష్టం చేసింది. దీంతో సచిన్ పైలట్ వర్గానికి భారీ ఊరట లభించినట్లే. సచిన్ పైలట్ (Sachin Pilot) పిటిషన్‌పై రాజస్థాన్ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించేందుకు సుప్రీం అనుమతినిచ్చింది. సచిన్ పైలట్‌ను 24 వరకూ టచ్ చేయవద్దు, రాజస్తాన్ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, పిటిషన్‌పై జూలై 24న తీర్పు ఇవ్వనున్న రాజస్థాన్ హైకోర్టు
హైకోర్టు నుంచి సుప్రీంకు బదిలీ చేయాన్న స్పీకర్ జోషి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పైలట్ సహా మరో 18 మంది ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేయడానికి దారి తీసిన కారణాలను తెలపాలంటూ స్పీకర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం వివరణ కోరింది. దీనిపై కపిల్ సిబల్ స్పందిస్తూ.. అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ సమావేశాలకు హాజరు కాలేదని, అంతేకాకుండా సొంత ప్రభుత్వాన్నే అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నారని కోర్టుకు నివేదించారు. సచిన్ పైలట్‌పై విరుచుకుపడిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, హైకోర్టులో కొనసాగుతున్న విచారణ, పైలట్ అనర్హతపై కోర్టు జోక్యం చేసుకోలేదని తెలిపిన న్యాయవాది అభిషేక్ మనూ సంఘ్వి
ఈ వర్గం ఎమ్మెల్యేలు హర్యానా హోటళ్లలో గడుపుతూ మీడియాకు అభిప్రాయాలు చెబుతున్నారని, ప్రభుత్వం బల పరీక్షను ఎదుర్కోవాలని కోరుతున్నారని సుప్రీంకు నివేదించారు. అనర్హత నోటీసులపై కోర్టులు జోక్యం చేసుకోలేవని కపిల్ సిబల్ తీవ్రంగా వాదించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, స్పీకర్ విచక్షణా అధికారాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని ఆయన వాదించారు. అంతకు ముందు సుప్రీం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో అసమ్మతి గొంతులను అణచివేయలేమని సుప్రీం స్పష్టం చేసింది. రాజస్థాన్‌లో ఆడియో టేపు కలకలం, కేంద్ర మంత్రికి నోటీసులు, ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొవడానికి సిద్ధమన్న షెకావత్, బలనిరూపణకు సిద్ధమైన సీఎం అశోక్ గెహ్లాట్
మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌తో పాటు 19 మంది ఎమ్మెల్యేలు అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే పూర్తి స్థాయి చర్యలు తీసుకోకముందే.. వారు కోర్టుకు వెళ్లడాన్ని స్పీకర్ జోషీ సుప్రీంలో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. రెబల్స్ వేసిన పిటిషన్‌పై శుక్రవారం కోర్టు తన తీర్పును వెలువరించేందుకు మార్గం సులువైంది. తటస్థ వ్యక్తి అయిన స్పీకర్ ఎందుకు కోర్టును ఆశ్రయించారని ఇవాళ సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.
ఓ నేత ఇతరులపై విశ్వాసం కోల్పోయినా.. ఒకవేళ వారు ఆ పార్టీలోనే ఉంటే వారిపై ఎలా అనర్హత వేటు వేస్తారని జస్టిస్ ఏకే మిశ్రా అడిగారు. ఇలా చర్యలు తీసుకుంటే అదే అలవాటుగా మారుతుందని, అప్పుడు వారు తమ స్వరాన్ని వినిపించలేరని, ప్రజాస్వామ్యంలో అసమ్మతి స్వరాన్ని ఇలా నొక్కిపెట్టలేమని జస్టిస్ మిశ్రా అన్నారు.
స్పీకర్ జోషీ తరపున న్యాయవాది కపిల్ సిబల్ కోర్టులో వాదించారు. పార్టీ సమావేశాలకు ఎందుకు హాజరకాలేదని.. రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్లు కపిల్ తెలిపారు. ఈ దశలో రెబల్స్‌కు మద్దతుగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వరాదు అని ఆయన వాదించారు. స్పీకర్ డిసైడ్ చేయాల్సిన కేసులో కోర్టు జోక్యం చేసుకోవడం సరికాదన్నారు.
సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 24న ఉత్తర్వులు జారీ చేసే వరకూ వారిపై అనర్హత ప్రక్రియను చేపట్టరాదని రాజస్తాన్ హైకోర్టు ఈనెల 21న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ జోషీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.