Prajwal Revanna Arrested: ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి జర్మనీ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన ప్రజ్వల్ రేవణ్ణ.. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన పోలీసులు
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీయూ నేత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కేసులో సస్పెన్స్ వీడింది.
Bengaluru, May 31: లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీయూ నేత (JDU), మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) కేసులో సస్పెన్స్ వీడింది. ఆయన్ని ఎట్టకేలకు నిన్న అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన గురువారం అర్ధరాత్రి బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో దిగగానే అదుపులోకి తీసుకున్నారు. లైంగిక ఆరోపణలు వెలుగులోకి రాకమునుపే ప్రజ్వల్ జర్మనీకి వెళ్లిపోయారు. ఆ తరువాత భారత్ కు తిరిగి రావడానికి నిరాకరించారు.
దేవెగౌడ వార్నింగ్ తో..
సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వడంతో చివరకు మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించారు. భారత్ కు వచ్చి దర్యాప్తునకు సహకరించకపోతే తన ఆగ్రహాన్ని చవి చూస్తావని రేవణ్ణకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.. దీంతో, ప్రజ్వల్ దిగొచ్చాడు. మరోవైపు, ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు గురువారం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.
జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్ ఫలితాలు, ఈసీ ట్వీట్ ఇదిగో..