Package a 'Cruel Joke': రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఓ క్రూరమైన జోక్, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ
ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ .20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన దేశంపై విధించిన "క్రూరమైన జోక్" (Rs 20 Lakh Crore Package a Cruel Joke) అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) శుక్రవారం సంయుక్త ప్రతిపక్ష సమావేశంలో అన్నారు.
New Delhi, May 23: విపక్షాల సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ .20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన దేశంపై విధించిన "క్రూరమైన జోక్" (Rs 20 Lakh Crore Package a Cruel Joke) అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) శుక్రవారం సంయుక్త ప్రతిపక్ష సమావేశంలో అన్నారు. అంఫాన్ మృతుల కుంటుంబాలకు రూ.2 లక్షల నష్టపరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించిన ప్రధాని మోదీ, అండగా ఉంటామని తెలిపిన ఢిల్లీ సీఎం
కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో ఆర్థికంగా దెబ్బతిన్న వలసదారులు, రైతులు, చిన్న వ్యాపారులు మరియు వ్యాపారవేత్తల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందుకు ప్రభుత్వంపై తీవ్రంగా దాడి చేయాలని బిజెపి వ్యతిరేక కూటమి (Joint Opposition Meet) భావిస్తోంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ అధ్యక్షత వహించారు.
మార్చిన 24న కేవలం 4 గంటల వ్యవధిలో లాక్‌డౌన్ ప్రకటించారని, ఎలాంటి సంసిద్ధత లేకుండానే లాక్‌డౌన్ (Lockdown) అమల్లోకి తెచ్చారని మండిపడ్డారు. అయినా సరే ప్రభుత్వానికి విపక్షాలు మద్ధతు ప్రకటించాయని గుర్తు చేశారు. 21 రోజుల మొదటి విడత లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తాయనుకున్నామని, ప్రస్తుతం వ్యాక్సిన్ కనిపెట్టే వరకు వైరస్ మన మధ్యే ఉండే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ప్రభుత్వం 4 లాక్‌డౌన్లు (4 Lockdowns) అమలు చేసినా, కరోనా మహమ్మారి నుంచి బయటపడే విధానం లేకుండా ఉన్నట్టు అనిపిస్తోందని ధ్వజమెత్తారు. వరుస లాక్‌డౌన్లు తీవ్ర దుష్ఫలితాలను అందించాయన్నారు.
కరోనావైరస్ టెస్టింగ్ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. కరోనా మహమ్మారి కారణంగా వలస కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో పాటు 13 కోట్ల మంది రైతులు, చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని పేర్కొన్నారు.