'Country Stands With You': అంఫాన్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్టపరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించిన ప్రధాని మోదీ, అండగా ఉంటామని తెలిపిన ఢిల్లీ సీఎం
PM Narendra Modi in West Bengal (Photo Credits: ANI)

Kolkata, May 22: అంఫాన్‌ తుఫానుతో (Amphan Cyclone) తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌కు (West Bengal) రూ.వెయ్యి కోట్ల తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) ప్రకటించారు. తుఫాను వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 80 మందికిపైగా మరణించగా, కోల్‌కతాలోని విమానాశ్రయం పూర్తిగా నీట మునిగిపోవడంతోపాటు, వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వే ద్వారా పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. కష్ట సమయంలో బెంగాల్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అంఫాన్ సైక్లోన్ కల్లోలం, 83 రోజుల తర్వాత మమతా ఇలాకాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ, స్వాగతం పలికిన వెస్ట్ బెంగాల్ సీఎం

అంఫాను తుఫాను తాకిడికి ప్రాణాలు వదిలిన మృతుల కుంటుంబాలకు రూ.2 లక్షల నష్టపరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అంతకుముందు పశ్చిమబెంగాల్ లో అంఫాన్ తుఫాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రధాని నరేంద్రమోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రధాని మోదీ వెంట సీఎం మమతాబెనర్జీ ఉన్నారు. అంఫాన్ విలయ తాండవానికి ఇప్పటివరకు బెంగాల్ లో 80 మంది మృతి చెందారు. ఒడిశాలో ఇద్దరు మృతి చెందారు. 44.8 లక్షల మంది ప్రభావితమయ్యారు. బంగ్లాదేశ్ లో 10 మంది మృతి చెందారు.

Here are the tweets:

అంఫాన్‌ తుఫాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌కు మద్దతుగా నిలుస్తోన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ కృతజ్ఞతలు తెలియజేశారు. అంఫాన్‌ విలయ తాండవం సృష్టించిన నేపథ్యంలో తనకు ఫోన్‌ చేసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. అంఫాన్‌ వల్ల తీవ్రంగా నష్టపోయిన బెంగాల్‌కు యావత్ జాతి అండగా ఉంటుందని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు.

Here's PM Narendra Modi conducts aerial survey

తుఫాను ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించడానికి ప్రధాని మోదీ ఒడిశాకు (Odisha) చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కోల్‌కతా నుంచి వచ్చిన మోదీకి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ (Odisha CM Naveen Patnaik), గవర్నర్‌ గణేషీలాల్‌, ఇతర అధికారులు భువనేశ్వర్‌ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. విధ్వంసం సృష్టించిన అంఫాన్, వెస్ట్ బెంగాల్,ఒడిషాలో భారీగా ఆస్తి నష్టం, నీటిలో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు, వీడియోల్లో విధ్వంసం ఎలా ఉందో మీరే చూడండి

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. కాగా అంఫాన్‌ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కరు కూడా మరణించలేదని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. తుఫాను వల్ల కోస్తా జిల్లాల్లో సుమారు 45 లక్షల మందిని ప్రభావితం చేసిందని, పెద్ద సంఖ్యలో ఆస్తి నష్టం సంభవించిందని వెల్లడించింది. ఈ తుఫాను వల్ల మరణించినట్లు తమ వద్ద అధికారిక సమాచారం లేదని వెల్లడిచింది.

ఇదిలా ఉంటే అంఫాన్‌ తుఫాన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలకు తాము మద్దతుగా నిలుస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ (Delhi Chief Minister Arvind Kejriwal) తెలిపారు. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జికీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు ఆయన సీంఘీభావం తెలియజేశారు. ‘డియర్‌ మమతా దీదీ, అంఫాన్‌ తుఫాన్‌ కారణంగా బెంగాల్‌కు తీవ్ర నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో మీకు, బెంగాల్‌ ప్రజలకు నాతోపాటు ఢిల్లీ ప్రజల తరఫున సంఘీభావం తెలుపుతున్నా. ఈ విపత్కర పరిస్థితుల్లో మీకు మేం మద్దతుగా నిలుస్తాం’అని కేజ్రివాల్‌ ట్విట్టర్లో పేర్కొన్నారు.  దీనికి మమతా బెనర్జీ ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్టర్లో రిప్లయి ఇచ్చారు. మీ సపోర్టు మాకు ఎనలైని ధైర్యాన్ని ఇస్తుందని రిప్లయి ఇచ్చారు.

Here's Tweets

‘ఇక ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను ఉద్దేశించి కేజ్రివాల్‌ మరో ట్వీట్‌ చేశారు. ‘డియర్‌ నవీన్ పట్నాయక్‌ తుఫాన్‌ ముప్పును ఎదుర్కొంటున్న మీకు, ఒడిశా ప్రజలకు నా తరఫున, ఢిల్లీ ప్రజల తరఫున సంఘీభావం తెలుపుతున్నా. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీకు అన్ని విధాలుగా మా మద్దతు ఉంటుంది’ అని ఢిల్లీ సీఎం ట్వీట్‌ చేశారు.