RS 'Not A Bazaar': ఇది పార్లమెంటు..బజారు కాదు, రాజ్యసభలో వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం, ఢిల్లీ అల్లర్లపై చర్చ చేపట్టాలంటూ విపక్షాల డిమాండ్, సభ రేపటికి వాయిదా

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లపై (Delhi violence) రాజ్యసభలో (Rajya Sabha) చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ ఘటనపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు సభలో ఆందోళనకు దిగాయి. చైర్మన్ ఎంత చెప్పినా వినకుండా నినాదాలు చేస్తూ సభను ఆటంకపరిచాయి. దీంతో వెంకయ్య నాయుడు (Chairman Venkaiah Naidu) వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

RS not a bazaar says Chairman Venkaiah Naidu, adjourns House till Friday (Photo-ANI)

New Delhi, Mar 05: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లపై (Delhi violence) రాజ్యసభలో (Rajya Sabha) చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ ఘటనపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు సభలో ఆందోళనకు దిగాయి. చైర్మన్ ఎంత చెప్పినా వినకుండా నినాదాలు చేస్తూ సభను ఆటంకపరిచాయి. దీంతో వెంకయ్య నాయుడు (Chairman Venkaiah Naidu) వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీ అల్లర్లకు ముందు నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు

చర్చలపై ఎలాంటి నోటీసు ఇవ్వకుండా.. చర్చలో పాల్గొనకుండా నినాదాలు చేయడం సరికాదని సభ్యుల తీరును తప్పుబట్టారు. సభ ముందుకు సాగకుండా దేశ ప్రజలకు, దేశానికి మంచిది కాదని ప్రతిపక్షాలకు సూచించారు. ఒకనొక దశలో ఛైర్మెన్ తీవ్ర ఆవేశాన్ని ప్రదర్శిస్తూ.. ‘‘నినాదాలు చేయొద్దు. ఇది పార్లమెంట్ .. బజారు కాదు’’ ( RS 'not a bazaar') అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అయినా సభ్యులు ఎంతకు శాంతించకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.

ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై వెంటనే చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. కాగా మార్చి 11 న హోళీ తరువాత దీనిపై చర్చ జరుగుతుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడంతో నాయుడు సభను రేపటికి వాయిదా వేశారు.

Here's ANI Tweet

47కి చేరిన మృతుల సంఖ్య, షాక్ నుంచి ఇంకా తేరుకోని ఈశాన్య ఢిల్లీ వాసులు

కాగా ఇదే అంశంపై 4 రోజులుగా వాయిదా వేస్తూ వస్తున్నారని ఇప్పుడు చర్చ జరగకపోతే సభను సజావుగా జరగనివ్వమని ప్రతిపక్షాలు బుధవారం స్పష్టం చేశాయి. అయితే చర్చలపై నోటీసు ఇవ్వలేదని తరువాత చర్చిద్దాం అని ఛైర్మెన్ చెప్పడంతో ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి.

సీఏఏ హింసపై మండిపడిన ఢిల్లీ హైకోర్టు

ఈ నేపథ్యంలోనే వెంకయ్యానాయుడు ఇది పెద్దల సభ అని, సభ్యులు నినాదాలు చేయరాదని అన్నారు. సభలో నినాదాలు చేయడాన్ని ఆపమని సభ్యులకు పదేపదే విజ్ఞప్తి చేసిన కూడా వినకపోవడంతో వెంకయ్యనాయుడు ఇది పార్లమెంట్..బజారు కాదు అనే వ్యాఖ్యలు చేశారు.

దేశంలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ సభలో ఒక ప్రకటన విడుదల చేసిన వెంటనే ఈ ఘటన జరిగింది. ఆరోగ్యమంత్రి ప్రకటన తర్వాత జీరో అవర్ లో ప్రతిపక్షాలు నినాదాలు చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now