New Delhi, Mar 05: ఢిల్లీ అల్లర్లకు (Delhi Violence) ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టులో (Supreme Court) దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఇందులో భాగంగా ఇక్కడ జరిగిన మతఘర్షణలకు కొందరు బీజేపీ నేతలు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా కారణమని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టాలని ఢిల్లీ హైకోర్టును (Delhi High Court) సుప్రీంకోర్టు కోరింది. హింసాత్మక ఘటనలకు సంబంధించిన పిటిషన్లపై విచారణలో జాప్యం సమర్థ్ధనీయం కాదని వ్యాఖ్యానించింది.
బీజేపీ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు పిటిషన్
దీనికి ముందు.. ఢిల్లీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై (BJP leaders hate speeches) ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఫిబ్రవరి 27న ఆ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు ఏప్రిల్ 13 వరకూ వాయిదా వేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు నమోదు కాగా సుప్రీంకోర్టు తాజాగా ఆరోతేదీనే విచారించాలంటూ హైకోర్టుకు సూచించింది.
ద్వేషం, హింస దేశంలో జరిగే అభివృద్ధికి శత్రువులని, పెరిగిపోతున్న విభజనవాదం వల్ల భారతమాతకు ఎలాంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని ఓ బృందం ఢిల్లీలో అల్లర్లు రేగిన ప్రాంతాలను సందర్శించింది. పలు ప్రాంతాలకు వెళ్లిన రాహుల్ గాంధీ పాఠశాలను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఏఏ హింసపై మండిపడిన ఢిల్లీ హైకోర్టు
ఇదిలా ఉంటే అల్లర్ల అనంతరం తీవ్ర ఆంక్షలతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు కొద్దికొద్దిగా బయటకు రావడం ప్రారంభించారు. ప్రభుత్వం పలు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. అల్లర్ల ప్రభావిత ప్రాంతంలోని ప్రజలు ఆ సమయంలో తమ బంధువుల ఇళ్లకు వెళ్లగా, ఇప్పుడు తిరిగి వచ్చి తమ ఇళ్ల నష్టాన్ని అంచనా వేసుకుంటున్నారు.
42కి చేరిన మృతుల సంఖ్య, షాక్ నుంచి ఇంకా తేరుకోని ఈశాన్య ఢిల్లీ వాసులు
ప్రస్తుతం పరిస్థితులు అన్నీ పోలీసుల అదుపులోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకూ 436 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, 1,427 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.