Sharad Pawar Resigns as NCP President: ఎన్సీపీ చీఫ్‌ పదవికి శరద్‌ పవార్‌ రాజీనామా, తదుపరి వారసుడిపై కొనసాగుతున్న సస్పెన్స్, రాజీనామా వెనక్కు తీసుకోవాలని కోరుతున్న కార్యకర్తలు

ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మంగళవారం ప్రకటించారు.

Sharad-Pawar

రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్రకు చెందిన సీనియర్‌ నాయకుడు, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి శరద్‌ పవార్‌ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మంగళవారం ప్రకటించారు. అయితే, పవార్‌ ఇంత అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? ఆయన ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటే తన వారసుడిగా లేదా వారసురాలిగా ఎవరికి ఆ బాధ్యతలు కట్టబెట్టబోతున్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.

మహారాష్ట్రలో మళ్లీ ఉత్కంఠ, 33 మంది ఎమ్మెల్యేలు జంపింగ్‌కు రెడీ అంటూ బాంబు పేల్చిన మంత్రి ఉదయ్‌ సమంత్‌

పవార్‌ తన రాజీనామా ప్రకటించగానే.. ఎన్సీపీ కేడర్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఆయన రాజీనామా చేయొద్దంటూ వేదిక మీదకు ఎక్కి నినాదాలు చేశారు పార్టీ కార్యకర్తలు. రాజీనామా వెనక్కు తీసుకోవాలంటూ కోరుతున్నారు.



సంబంధిత వార్తలు