మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే, పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్‌ సమంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్‌లో ఉన్న 13 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు షిండే గ్రూపుతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. మహాబలేశ్వర్‌లోని సీఎం షిండేతో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రహస్యంగా సమావేశమయ్యారని అన్నారు.ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్దవ్‌ వర్గం అప్రమత్తమైనట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఖర్ఘర్ ఘటన తర్వాత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ఆ పదవి నుంచి తప్పిస్తారనే చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.

Here's Uday Samant Statement

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)