Kejriwal on Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ మూవీని య్యూట్యూబ్‌లో పెట్టండి! బీజేపీ నేతలు పోస్టర్ బాయ్స్‌గా మారారు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు, కశ్మీరీ పండిట్ల పేరుమీద కొందరు కోట్లు సంపాదించుకుంటున్నారు
కొందరు ఈ సినిమా పేరుతో కోట్లు సంపాదిస్తుంటే, బీజేపీ నేతలు (BJP Leaders) మాత్రం పోస్టర్లు అంటించేవారిగా మారిపోయారంటూ విమర్శించారు.
New Delhi, March 25: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కశ్మీర్ ఫైల్స్(The Kashmir Files) మూవీకి వినోదపన్ను రాయితీ ఇవ్వాలన్న డిమాండ్ పై భిన్నంగా స్పందించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal). కొందరు ఈ సినిమా పేరుతో కోట్లు సంపాదిస్తుంటే, బీజేపీ నేతలు (BJP Leaders) మాత్రం పోస్టర్లు అంటించేవారిగా మారిపోయారంటూ విమర్శించారు. అంతేకాదు అందరూ చూడాల్సిన చిత్రం అయితే దానికి వినోదపన్ను రాయితీ ఎందుకు, ఫ్రీగా య్యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయొచ్చు కదా! అంటూ సూచించారు. ఢిల్లీలో ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలంటూ ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేలు (BJP Mla's) డిమాండ్ చేశారు. ప్రజలు నిజాలు తెలుసుకోవాల్సిన చిత్రాలే అయితే ఇలా టికెట్ ధరలు పెట్టి, పన్ను మినహాయింపులు ఇవ్వడం దేనికని..నిజానిజాలు అందరికి తెలిసేలా అటువంటి చిత్రాలను యూట్యూబ్ లో ఉచితంగా పోస్ట్ చేయాలనీ కేజ్రీవాల్ (Kejriwal)అభిప్రాయపడ్డారు.
ఇక దేశంలోని అన్ని వర్గాలతో పాటు..సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఈ చిత్రంపై ప్రసంశలు కురిపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ చిత్రానికి పన్ను మినహాయింపు కూడా ప్రకటించారు. ప్రధాని మోదీ (PM Modi) సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. దేశంలోని ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రమని ముఖ్యంగా యువత ఈ చిత్రాన్ని చూసి నిజానిజాలను తెలుసుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, త్రిపుర, గోవా మరియు ఉత్తరాఖండ్‌తో సహా పలు రాష్ట్రాల్లో ఈ చిత్రంపై వినోద పన్ను మినహాయింపు ఇచ్చారు.
ఇటీవల భారత్ లో విడుదలైన చిత్రం “ది కాశ్మీర్ ఫైల్స్” (The Kashmir Files) దేశ వ్యాప్తంగా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. కాశ్మీర్ పండిట్లపై (Kashmiri Pandits) ఊచకోత, ఉగ్రవాదుల చర్యలతో ఆ రాష్ట్రం నుంచి వలస వెళ్లిన పండిట్ల వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
భారత్ లో అంతర్భాగమైన కాశ్మీర్ లో పండిట్లపై జరిగిన దారుణ ఘటనలు హిందూ మతాన్ని అణిచివేసేందుకు ఉగ్రవాదులు చేపట్టిన అమానవీయ చర్యలుగా అభివర్ణిస్తూ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 11న విడుదలైన ఈచిత్రం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విజవంతంగా ప్రదర్శించబడుతుంది. కలెక్షన్స్ లో ఇప్పటికే రూ.200 కోట్ల మెయిలురాయిని దాటిన “ది కాశ్మీర్ ఫైల్స్” చిత్రం..తక్కువ సమయంలో ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చోటుసంపాదించింది.