TDP leader attacked: బెజవాడలో భగ్గుమన్న రాజకీయ కక్షలు.. టీడీపీ నాయకుడిపై దాడి.. పరిస్థితి విషమం..
విజయవాడ నగరం మరో మారు రాజకీయ కక్షలతో భగ్గుమంది. శనివారం సాయంత్రం.. టీడీపీ సీనియర్‌నేత చెన్నుపాటి గాంధీపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. దీంతో చావు బతుకుల మధ్య హైదరాబాద్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు.
Amaravati, September 4: విజయవాడ నగరం మరో మారు రాజకీయ కక్షలతో భగ్గుమంది. టీడీపీకి చెందిన సీనియర్ నేత ఒకరు చావు బతుకుల మధ్య హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. శనివారం సాయంత్రం.. టీడీపీ సీనియర్‌నేత చెన్నుపాటి గాంధీపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. పటమటలంకలోని గర్ల్స్ హైస్కూల్ వద్ద గాంధీపై వైసీపీకి చెందిన వర్గీయులు దాడి చేసి గాయపర్చారు. కంటికి తీవ్రగాయాలు కావడంతో తాడిగడప ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి వైసీపీ వర్గీయులు, దేవినేని అవినాష్ మనుషులే చేశారని టీడీపీ ఆరోపించింది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో చెన్నుపాటి గాంధీ భార్య తొమ్మిదో డివిజన్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి
వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన క్యాండిడేట్ మద్యం మత్తులో కావాలని గొడవపడినట్టు సమాచారం. వల్లూరు ఈశ్వర్ ప్రసాద్, వైసీపీ నాయకులు గద్దె కల్యాణ్, సుబ్బుతో పాటు మరో ముగ్గురు దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. గాంధీ ఆరోగ్య వివరాలను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(TDP leader and former CM Chandrababu) ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకెన్నాళ్లీ నెత్తుటి రాజకీయాలు చేస్తారంటూ నారా లోకేశ్ వైసీపీపై మండిపడ్డారు. చెన్నుపాటి గాంధీ పై దాడికి తెగబడింది వైసీపీ ఫ్యాక్షన్ మూకలే అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)