Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కు ఘన నివాళి

ఈ నెల 26న తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కు నివాళులర్పించనున్నది.

Telangana Assembly special session on Monday, pay tribute to former Prime Minister Manmohan Singh

Hyderabad, Dec 30: తెలంగాణ శాసనసభ సోమవారం (నేడు) (Telangana Assembly Session) ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఇటీవల తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) కు నివాళులర్పించనున్నది. ఈ మేరకు ప్రభుత్వం రెండు రోజుల క్రితమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంపై నిర్ణయించిన విషయం తెలిసిందే. సభ ఉదయం 10గంటలకు ప్రారంభం కానుండగా, సభ్యులంతా మన్మోహన్‌ సింగ్‌ దేశానికి చేసిన సేవల్ని స్మరించుకోవడంతోపాటు నివాళులర్పించనున్నారు. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడనున్నది.

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత.. వందేళ్లు బతికిన తొలి ప్రెసిడెంట్‌ గా రికార్డు

ఆర్ధిక మార్గదర్శి

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని తన మేథస్సుతో గట్టెక్కించడమే కాకుండా పదేండ్లు ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ ఎన్నో చిరస్మరణీయ పథకాలను అమలు చేశారు. ఈ నెల 26న ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. దేశాన్ని నవ్యపథంలో నిలిపిన సింగ్ కు తెలంగాణ ప్రజాప్రతినిధులు నివాళి అర్పించనున్నారు.

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్, న్యూఇయర్ రోజున వైన్స్ 12 గంటల వరకు, బార్లు, పబ్స్ కు ఒంటి గంట వరకు అనుమతి