Uddhav Thackeray Address: శివసేన సైనికుడు ఎవరైనా సీఎం కావొచ్చు, నేను నచ్చలేదని ఎవరైనా చెబితే శివసేన చీఫ్‌గా దిగిపోవడానికి సిద్ధం, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
దానిని పార్టీ గానీ, తాము గానీ ఎప్పుడూ వదిలిపెట్టలేదని చెప్పారు. హిందూమతం, శివసేన ఎప్పుడూ కలిసే ఉంటాయి. శివసేన స్టాండ్ ఎప్పటికీ హిందుత్వమే. ఇది సరికొత్త శివసేన.
Mumbai, June 22: మహారాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రసంగించారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై శివసేన అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఫేస్‌బుక్ లైవ్ ద్వారా (Uddhav Thackeray Address) ప్రసంగించారు. తనకు ఈరోజు(బుధవారం) కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపిన సీఎం.. అయితే ఎలాంటి లక్షణాలు లేవని అన్నారు.
చెప్పాల్సింది చాలా ఉదని, ఈ రోజు చాలా ప్రశ్నలకు సమాధానమిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పదవి కోసం పోరాటం చేసే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తానేమీ సీఎం కావాలని కోరుకోలేదని, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అభీష్టం మేరకే తాను ముఖ్యమంత్రి పదవిని (Maharashtra CM) స్వీకరించానని ఆయన చెప్పుకొచ్చారు. సీఎంగా తాను సమర్థంగానే పనిచేశానని కూడా ఆయన తెలిపారు.
హిందూత్వ అనేది తమ పార్టీ సిద్ధాంతమన్న థాకరే... దానిని పార్టీ గానీ, తాము గానీ ఎప్పుడూ వదిలిపెట్టలేదని చెప్పారు. హిందూమతం, శివసేన ఎప్పుడూ కలిసే ఉంటాయి. శివసేన స్టాండ్ ఎప్పటికీ హిందుత్వమే. ఇది సరికొత్త శివసేన. దేశంలో టాప్-5 సీఎంలలో నేను ఒకడిని. బాల్‌థాకరే వారసత్వాన్ని కొనసాగించేది మేమే. నేను ప్రజల్నికలవడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారు. కరోనా వల్ల ప్రజలను కలవలేకపోతున్నా. ఇప్పుడు ఉత్పన్నమైన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. అన్ని సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం’ అని సీఎం పేర్కొన్నారు.
సీఎం పదవికి తాను సరిపోనని పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తే పదవి నుంచి దిగిపోయేందుకు తాను సిద్ధమేనని(Will Resign As Chief Minister if Even One MLA Against Me) కూడా ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ఒక్క ఎమ్మెల్యే చెప్పినా... మరుక్షణమే తాను పదవికి రాజీనామా చేస్తానని థాకరే కీలక ప్రకటన చేశారు. సీఎం పదవికి రాజీనామా లేఖను తన వద్దే సిద్ధంగా ఉంచుకున్నానని కూడా ఆయన ప్రకటించారు.
శివసైనికుడు ఎవరైనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చని ఉద్ధవ్ థాకరే అన్నారు. తాను నమ్మక ద్రోహానికి గురయ్యానని చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనను వ్యతిరేకించడంతో షాక్ కు గురయ్యానని తెలిపారు. రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని గవర్నర్ కు తెలిపానని అన్నారు. చర్చలకు రావాలని ఏక్ నాథ్ షిండే, రెబెల్ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నానని చెప్పారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా లేనని తెలిపారు.
శివసేన పార్టీని నడిపేందుకు తాను పనికిరానని చెపితే తాను తప్పుకుంటానని (Ready to Quit As Shiv Sena Party Leader Too) ఉద్ధవ్ అన్నారు. అధికారం కోసం తాను పాకులాడటం లేదని చెప్పారు. రెబల్ ఎమ్మెల్యేలు కోరితే సీఎంగా తప్పుకుంటా. సొంత ఎమ్మెల్యేలే వద్దనడం బాధగా ఉంది. రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని గవర్నర్‌కు కూడా తెలియజేశానని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఎన్నికలకు వెళ్లి మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. శివసేన చీఫ్‌గా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నా. అయితే ముందు నేను చేసిన తప్పేంటో రెబల్ ఎమ్మెల్యేలు చెప్పాలి. సీఎం నివాస గృహం వర్షను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. చర్చలకు రావాలని రెబల్ ఎమ్మెల్యేలను, ఏక్‌నాథ్ షిండేను ఆహ్వానిస్తున్నా. నాతో ఏక్‌నాథ్ షిండే నేరుగా మాట్లాడాడాలని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు.