Maharashtra Political Crisis: మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామాలో ట్విస్ట్, ఏక్‌నాథ్ షిండేకు షాకిచ్చిన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్
మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. తాజాగా రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండేతో కలిసి సూరత్ వెళ్లిన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ అక్కడి నుంచి తిరిగి మహారాష్ణ చేరుకున్నారు. ఈ సందర్భంగా రెబల్ ఎమ్మెల్యేలపై నితిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనను కిడ్నాప్ చేసి సూరత్‌కు తీసుకెళ్లారని ఆరోపించారు
మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. తాజాగా రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండేతో కలిసి సూరత్ వెళ్లిన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ అక్కడి నుంచి తిరిగి మహారాష్ణ చేరుకున్నారు. ఈ సందర్భంగా రెబల్ ఎమ్మెల్యేలపై నితిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనను కిడ్నాప్ చేసి సూరత్‌కు తీసుకెళ్లారని ఆరోపించారు. కొంతమంది బలవంతంగా ఆసుపత్రిలో చేర్పించి తనకు గుండెపోటు రానప్పటికీ ఇంజెక్షన్లు ఇచ్చారని పేర్కొన్నారు. సూరత్ నుంచి తప్పించుకొని సురక్షితంగా బయటపడ్డానని అన్నారు. తను శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేకు మద్దతుగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇంతకముందు మంగళవారం నితిన్ దేశ్‌ముఖ్ భార్య.. తన భర్త సోమవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్త కు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నితిన్ దేశ్‌ముఖ్ అకోలా జిల్లాలోని బాలాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
#WATCH | Shiv Sena MLA Nitin Deshmukh - who returned to Nagpur from Surat - says, "...100-150 Policemen took me to a hospital & pretended as I've suffered an attack. They wanted to operate on me, harm me under that pretext. By God's grace, I'm alright. I am with Uddhav Thackeray" pic.twitter.com/r1uSOMK0IS
— ANI (@ANI) June 22, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 22, 2022 06:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

