Prakash Javadekar: ఏపీకి మొండి చేయి చూపిన కేంద్రం, తప్పక న్యాయం జరుగుతుందన్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, ఏపీకి జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. కేంద్ర బడ్జెట్ గురించి ఆయన మాట్లాడుతూ, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని తెలిపారు.

Union Minister Prakash Javadekar Says AP and J&K are Not Comparable | (Photo Credits: ANI)

New Delhi, Febuary 01: బడ్జెట్‌పై కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ప్రసంశలు గుప్పించారు. ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ (Union Minister Prakash Javadekar) అన్నారు. కేంద్ర బడ్జెట్ (Union Budget 2020) గురించి ఆయన మాట్లాడుతూ, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh) గురించి ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని తెలిపారు.

Defence Budget 2020

జమ్మూకాశ్మీర్‌ (Jammu And Kashmir) ఆంధ్రప్రదేశ్‌ రెండూ వేరువేరు అంశాలన్నారు. ఆర్టికల్ 371 రద్దు (Atricle 370) చేసి, జమ్మూ కాశ్మీర్‌ను యూటిగా చేశామని పేర్కొన్నారు. ఈ దశబ్దానికి తొలి బడ్జెట్‌ అంటూ కొనియాడారు. కేంద్ర బడ్జెట్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. బ్యాంక్ డిపాజిట్లపై ఇచ్చే భీమాను రూ. 5లక్షలకి పెంచడం సామాన్యులకు ఇచ్చిన బహుమతిగా పేర్కొన్నారు. బడ్జెట్ లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Railway Budget 2020

కేంద్ర బడ్జెట్‌ తమకు నిరాశ కలిగించిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బడ్జెట్‌ నిరుపయోగమని ఆయన పెదవి విరిచారు.

Education Budget 2020

బడ్జెట్‌ ప్రసంగం అనంతరం ఆయన శనివారం పార్లమెంట్‌ ఆవరణలో వైఎస్సార్‌ సీపీ ఎంపీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదు. బడ్జెట్‌లో కొన్ని అనుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయి. డిపాజిటర్ల బీమ లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం మంచి పరిణామం.

Agriculture Budget 2020-21

వ్యవసాయ కేటాయింపుల్లో ఏపీకి రావాల్సిన వాటాను కచ్చితంగా ఇ‍వ్వాలి.రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. ఆ విధానంలో స్పష్టత లేదు. పోలవరం ప్రాజెక్ట్‌ త్వరితగతిన నిధులు కేటాయించాలి. అలాగే రాష్ట్రానికి, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలి. నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపించింది.

పన్ను చెల్లింపుదారులకు ఊరట

పక్షపాత ధోరణితో రాష్ట్రాన్ని వివపక్షతతో చూడటం మంచిది కాదన్నారు. ఈ బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తామని చెప్పారు. బడ్జెట్కు సంబంధించి పూర్తి వివరాలు అందిన తర్వాత, సమగ్రంగా విశ్లేషించి మళ్లీ స్పందిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.