New Delhi,Febuary 01: బడ్జెట్‌లో (Union Budget 2020) విద్యారంగానికి (Education) రూ. 99,300 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం 3వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ సందర్బంగా డిగ్రీ స్థాయిలో ఆన్లైన్ కోర్సులు ప్రవేశపెట్టనున్నట్టు నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. త్వరలోనే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తామని... మార్చి 2021 నాటికి అప్రెంటీస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ, డిప్లొమా కోర్సులు ప్రవేశపెడతామని అన్నారు.
నేషనల్ పోలీస్ యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా స్థాయిలో ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల ఏర్పాటు చేస్తామని తన ప్రసంగంలో వివరించారు. సింధు, సరస్వతి యూనివర్శిటీలు ప్రారంభిస్తామని అన్నారు. టీచర్లు, పారామెడికల్ స్టాఫ్, నర్సులకు డిమాండ్ ఉందని... వారికి బ్రిడ్జ్ కోర్సు అందిస్తామని తెలిపారు.
బడ్జెట్ లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2026 నాటికి 150 వర్సిటీల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కొత్త కోర్సులు ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ప్రధాన యూనివర్సిటీల్లో ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులు తీసుకువస్తామన్నారు. విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. భారత్‌లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం ఇన్సాట్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతి జిల్లా ఆస్పత్రికి ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
డిగ్రీ స్థాయిలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నట్లు మంత్రి చెప్పారు. మొత్తం 100 వర్సిటీలు ఈ ఆన్‌లైన్ విద్యను అందించనున్నాయి. నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్‌ను ప్రారంభించనున్నామని, దీని కోసం 1480 కోట్ల కేటాయించినట్లు తెలిపారు.
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెమీకండక్టర్ల ప్యాకేజింగ్‌పై ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని త్వరలో రిలీజ్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో సింగిల్ విండో ఈ-లాజిస్టిక్స్ మార్కెట్ క్రియేట్ చేయవచ్చు అన్నారు. పరిశ్రమలు, వాణిజ్య అభివృద్ధి కోసం 27 వేల 300 కోట్లు కేటాయించారు.
యువ ఇంజినీర్లకు పట్టణ స్థానిక సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసే ప్రోగ్రాంను (internship to young engineers) ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. భేటీ బచావో, భేటీ పడావో పథకం అద్భుత పనితీరు కనబర్చిందని ఆమె తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి భారీగా నిధులు
అన్ని స్థాయిల్లోనూ బాలుర కంటే బాలికల ఎన్‌రోల్ రేషియోనే ఎక్కువగా ఉందని మంత్రి తెలిపారు. ప్రాథమిక స్థాయిలో బాలుర ప్రవేశాల నిష్పత్తి 89.28 శాతం ఉండగా.. బాలికల నిష్పత్తి 94.32గా ఉంది. సెకండరీ లెవల్‌లో బాలుర ప్రవేశాల నిష్పత్తి 78 శాతం కాగా బాలికల నిష్పత్తి 81.32 శాతం ఉంది. హయ్యర్ సెకండరీలోనూ బాలికలదే పైచేయిగా ఉంది. పోషకాహర కార్యక్రమాల కోసం రూ.35,600 కోట్లు కేటాయించారు.