Union Budget 2020: మీ సొమ్ముకు మరింత భద్రత, బ్యాంకు డిపాజిట్లపై బీమా పెంపు, ప్రైవేటీకరణ దిశగా ఎల్‌ఐసీ, ఎల్ఐసీ వాటాల విక్రయానికి నిర్ణయం,స్టాక్ మార్కెట్లో ఎల్‌ఐసీ లిస్టింగ్
PMC Bank (Photo Credits: IANS)

New Delhi,Febuary 01: రోజంతా కష్టపడి రూపాయి రూపాయి పొదుపు చేసి బ్యాంకుల్లో దాచుకునే సొమ్ముకు మరింత భద్రత కల్పిస్తూ మధ్యతరగతి ప్రజలకుకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుభవార్త ప్రకటించారు. ఇందులో భాగంగా బ్యాంకు డిపాజిట్లపై ఉన్న బీమాను (Deposit insurance) పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రకటించారు.

ఇప్పటి వరకు ఉన్న రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్‌లో ఫిబ్రవరి 01వ తేదీ శనివారం ఉదయం 11గంటలకు బడ్జెట్ 2020-21ను ( Union Budget 2020) ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు రంగాలకు కేటాయింపులు జరిపారు.

బడ్జెట్ లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

అన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు ( Deposits)సురక్షితంగా ఉన్నాయని, ప్రభుత్వం ఎలాంటం కంగారు పడనవసరం లేదని భరోసా ఇచ్చారు. దీంతో పాటుగా ప్రముఖ బీమా సంప్థ ఎల్ఐసీనీ (LIC) స్టాక్ ఎక్సేంజీలో లిస్ట్ చేయనున్నుట్లు తెలిపారు. డీఐసీజీసీ చట్టం 1961లోని సెక్షన్ 16 (1) నిబంధనల ప్రకారం బ్యాంకులు విఫలమైనప్పుడు లేదా నష్టాల్లో కూరుకుపోయినప్పుడు ఖాతాదారుల డిపాజిట్లపై బీమా కవరేజీ ఇస్తారు.

పన్ను చెల్లింపుదారులకు ఊరట

ఆర్బీఐ అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పోరేషన్ ఈ బీమాను అందిస్తోంది. ఖాతాదారుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయకుండానే బ్యాంకులు చెల్లించే ప్రీమియంతో డిపాజిటర్లకు నిర్దేశించిన గరిష్ఠ మొత్తం వరకు బీమా భద్రతను కల్పిస్తోంది.

ప్రతి ఇంటికి ఫైబర్ కనెక్షన్

పొదుపు, ఫిక్స్డ్ , కరెంట్ ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లపై ఈ బీమా వర్తిస్తుంది. ప్రస్తుతం ఖాతాదారుల డిపాజిట్లపై రూ. లక్ష వరకు బీమా సదుపాయం ఉంది. దీన్ని పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో బీమా కవరేజిని రూ. 5 లక్షల వరకు పెంచుతూ బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. గత సంవత్సరం PMC బ్యాంకును మూసివేయడంపై ప్రభుత్వం..ఆర్బీఐపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ప్రజలు తమ సొంత డబ్బులను కూడా తీసుకోకుండా..నిస్సహాయతతో మిగలిపోయారు.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి భారీగా నిధులు

కాగా మొత్తం డిపాజిట్ ఖాతాల్లో రూ. లక్ష లోపు 61 శాతం, రూ. 2 లక్షల లోపు 70 శాతం, రూ. 15 లక్షల లోపు 98.2 శాతం ఉన్నాయని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది. పన్ను చెల్లింపు దారులను కాపాడుతామని, పన్నులు చెల్లింపు చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో మరిన్న ఉద్యోగాలు కల్పిస్తామని, అలాగే..పన్ను ఎగవేత దారులపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రైవేటీకరణ చేసే దిశగా ఎల్ఐసీ (life insurance corporation of india)

ఇదిలా ఉంటే ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi) సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎయిర్‌ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థల వాటాలను విక్రయించడానికి నిర్ణయం తీసుకున్న మోదీ సర్కారు.. ఇప్పుడు ఎల్ఐసీ వాటాల విక్రయానికి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. త్వరలో స్టాక్ మార్కెట్లో ఎల్‌ఐసీ లిస్టింగ్ చేయనున్నట్లు ఆమె అన్నారు. ఈ ప్రతిపాదనకు ఎల్ఐసీ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

డిజ్‌ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ పేరుతో వివిధ సంస్థల్లో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్యాంకుల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరగాలని, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు మరిన్ని ప్రోత్సాహకాలు అంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3.5 లక్షల మూలధన సాయం చేస్తామని, ఐడీబీఐ బ్యాంకుల్లో వాటాలను కూడా విక్రయించనున్నట్టు తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లతో పోలిస్తే ఆర్థిక సంవత్సరం 2020-21 నాటికి రూ.2.1 లక్షల కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంగా కేంద్రం నిర్ణయించింది. లక్ష కోట్ల రూపాయల విశ్లేషకుల అంచనాలకు మించి ఈ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ప్రభుత్వం రూ.18, 094.59 కోట్లను ఉపసంహరించుకుంది.

ఎల్ఐసీ.. ఐపీఓ (initial public offer (IPO) ఉపసంహరణ భాగంలోనే ఉందని, ప్రభుత్వం పెట్టబడులు పెట్టేందుకు ఈ ఉపసంహరణ పథకాన్ని తీసుకొస్తున్నట్టు ఎస్ సెక్యూర్టీస్ అమర్ అంబానీ తెలిపారు. ఇది రూ.1.35 లక్షల కోట్ల లక్ష్యం కంటే ఎక్కువ అని ఆయన అన్నారు. ఎల్ఐసీలో ఐపీఓను పారదర్శకంగా చేయనున్నట్టు రైట్ హారిజన్స్ వ్యవస్థాపకులు, సీఈఓ అనిల్ రెగో తెలిపారు.