Arvind Kejriwal: అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పై మరికొద్దిసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఆసక్తి

మద్యం పాలసీ కేసులో అరెస్టై, జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు మరికొద్దిసేపట్లో తీర్పు వెలువరించనుంది.

kejriwal(X)

Newdelhi, Sep 13: మద్యం పాలసీ కేసులో (Delhi excise policy case) అరెస్టై, జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు మరికొద్దిసేపట్లో తీర్పు వెలువరించనుంది. సీబీఐ (CBI) నమోదు చేసిన అవినీతి కేసులో తన అరెస్టును, ఢిల్లీ హైకోర్టు తనకు బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరిస్తూ సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ ఈ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపైనా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. అయితే, ఈ నెల 5న కేజ్రీవాల్ పిటిషన్‌ పై విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ లో ఉంచిన విషయం తెలిసిందే. తాజాగా ఆ తీర్పును కోర్టు వెలువరించనున్నది.

తనపై హత్యాయత్నం జరిగింది, దాడి చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..వీడియో

అలా అయితే, బయటకే

మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌ ను ఈడీ అరెస్టు చేసింది.  ఈడీ నమోదు చేసిన కేసులో ఆయనకు సుప్రీంకోర్టు ఇట్టేవలె బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా, జూన్ 26న ఈ మద్యం కేసులోనే కేజ్రీని సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. దీంతో సీబీఐ కేసులో నేడు బెయిల్ వస్తే, కేజ్రీవాల్ బయటకు వచ్చినట్టేనని విశ్లేషకులు చెప్తున్నారు.

టాలీవుడ్ లో విషాదం.. ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు..’ వంటి హిట్‌ సాంగ్స్ అందించిన పాటల రచయిత గురు చరణ్‌ ఇకలేరు