PM Modi With Lungi: మరోసారి పంచె కట్టులో అదరగొట్టిన మోడీ, మహాబలిపురంలో జిన్‌పింగ్‌కు ఘన స్వాగతం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
ఎప్పుడూ కుర్తా, పైజామా, హాఫ్ స్లీవ్ జాకెట్‌లో కనిపించే ప్రధాని మహాబలిపురం పర్యటన సంధర్భంగా అచ్చ తమిళ కట్టు లుంగీతో దర్శనమిచ్చారు.
Mahabalipuram, October 11: చాలా రోజుల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ లుంగీ కట్టుతో మెరిసారు. ఎప్పుడూ కుర్తా, పైజామా, హాఫ్ స్లీవ్ జాకెట్‌లో కనిపించే ప్రధాని మహాబలిపురం పర్యటన సంధర్భంగా అచ్చ తమిళ కట్టు లుంగీతో దర్శనమిచ్చారు. ఇంతకుముందు సౌత్ ఇండియన్ స్టార్ రజినీ కాంత్ ను కలిసిన సంధర్భంలో ప్రధాని పంచెకట్టులో మెరిసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మళ్లీ తమిళ సంప్రదాయంలో పంచెకట్టుతో దర్శనమిచ్చారు. ఈ సంధర్భంగా ప్రధాని భారత పర్యటనకు వచ్చిన జిన్‌పింగ్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం మహాబలిపురంలోని షోర్ ఆలయాన్ని చైనా అధ్యక్షునికి పరిచయం చేశారు. ప్రపంచాధినేతలు ఇద్దరూ కలిసి యునెస్కో వారసత్వ సంపదైన మహాబలిపురం ఆలయం ప్రాంగణంలో తిరుగుతూ మాట్లాడుకున్నారు. మోదీ-జిన్‌పింగ్ భేటీ, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ ప్రధాని
ఆలయ విశిష్టత గురించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు భారత ప్రధాని మోడీ వివరించారు. కాగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా షర్ట్, ప్యాంట్‌తో చాలా సింపుల్‌గా కనిపించారు.
ఇద్దరు ప్రపంచాధినేతలు మాటామంతీ
అచ్చం ఓ తమిళుడిని తలపించే ఆహార్యంతో ఆయన జిన్ పింగ్ కు స్వాగతం పలికడం విశేషం. మహాబలిపురంలోని అనేక చారిత్రక ప్రదేశాలతో పాటు యునెస్కో వారసత్వ కట్టడాలను కూడా జిన్ పింగ్ కు దగ్గరుండి చూపించారు.
మహాబలిపురంలో మోడీ , చైనా అధ్యక్షుడు
తమిళ సంప్రదాయ వస్త్రధారణలో మహాబలిపురం వచ్చిన ప్రధాని.. తెల్ల లుంగీ, తెల్లచొక్కా, కండువాతో దర్శనమిచ్చారు. జిన్ పింగ్ కూడా తెల్లచొక్కాలోనే అక్కడకు వచ్చారు. ఈ సంధర్భంగా షోర్ టెంపుల్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
షోర్ టెంపుల్ విశిష్టతను తెలుపుతున్న ప్రధాని
అవి ముగిశాక అక్కడే జిన్ పింగ్ కు విందు ఇవ్వనున్నారు మోడీ జిన్ పింగ్ కు ఇచ్చే విందులో చైనా వంటకాలతో పాటు తమిళ రుచులను కూడా వడ్డించనున్నారు.
లుంగీ డ్యాన్స్ అంటూ ట్వీట్
గతంలోనూ తమిళనాడులో పర్యటించిన సందర్భంగా మోడీ లుంగీతో పై విధంగా దర్శనమిచ్చారు. సౌత్ ఇండియన్ స్టార్ రజినీ కాంత్ ను కలిసిన సంధర్భంలోని ఫోటో అది