R Krishnaiah on Jagan: జగన్‌పై ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు, తన ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూశారంటూ హాట్ కామెంట్స్

అయితే తన ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకోవాలని జగన్ చూశారని హాట్ కామెంట్స్ (R Krishnaiah on Jagan) చేశారు. తానెప్పుడు బీసీల కోసమే ఉద్యమం చేస్తామన్నారు.

R Krishnaiah on Jagan (photo-X)

Hyd, Sep 25: ఎంపీ పదవికి రాజీనామా తర్వాత బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మీడియా సమావేశం నిర్వహించారు. తన రాజీనామాకు గల కారణాలు వివరించారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే తాను రాజ్యసభ పదవికి రాజీనామా చేశానని కృష్ణయ్య (R Krishnaiah) అన్నారు.బీసీల కోసం తాను చేస్తున్న ఉద్యమాన్ని గుర్తించి ఎంతో అభిమానంతో వైఎస్ జగన్ తనకు రాజ్యసభ అవకాశం కల్పిచారని చెప్పారు.

బీసీ కులాలకు సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో తనకీ అవకాశం ఇచ్చారన్నారు. అయితే తన ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకోవాలని జగన్ చూశారని హాట్ కామెంట్స్ (R Krishnaiah on Jagan) చేశారు. తానెప్పుడు బీసీల కోసమే ఉద్యమం చేస్తామన్నారు.

బీసీ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్లే క్రమంలో మా వెనుక ఏదో రాజకీయ పార్టీ ఉందనే మచ్చ వస్తుందని.. దానిని అరికట్టేందుకే పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొంత మేర బీసీల అభివృద్ధి జరిగిందని ఇది దేశమంతటా జరగాలనేది మా డిమాండ్ అన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఇక్కడ బీసీలు చదువునేందుకు అకాశాలు కల్పించినట్లుగా మిగతా రాష్ట్రాల్లోనూ బీసీలకు విద్యావకాశాలు మెరుగుపరచాలన్నారు. అప్పుడు మాత్రమే కులాల లోపల అన్ని రంగాల్లో సమానత్వం మొదలవుతుందన్నారు.

చంద్రబాబుకు అమ్ముడుపోయిన ఆర్‌ కృష్ణయ్యను తెలుగు ప్రజలు క్షమించరు, మాజీ మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

బీసీల హక్కుల సాధన కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని. ఒక్క తెలంగాణలో బలమైన బీసీ ఉద్యమం ఉంటే దాని ప్రభావం పక్కరాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందన్నారు. దానికోసం ఓ వైపు అనారోగ్యంతో బాధపడుతున్నా, మరో వైపు వయసురీత్యా ఇబ్బందులు ఉన్నా బీసీ ఉద్యమం కోసం పోరాటం చేస్తున్నాన్నారు. చట్టసభల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించడం నా జీవిత ధేయం అని దీని కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎంతకైనా తెగిస్తానని వారితో చెప్పానన్నారు.

రాజకీయ పార్టీ పెట్టాలనే ఒత్తిడి ఉందని అయితే దానిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీ ఏర్పాటు విషయంలో మిగతా పెద్దలతో ఆలోచన చేయాల్సి ఉందన్నారు. తాను రాజీనామా చేశాక అనేక పార్టీలు తనను సంప్రదించి తమ పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నాయని కానీ నేను వారి ప్రతిపాదనలను అంగీకరించలేదన్నారు.

ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆర్‌.కృష్ణయ్య, పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే రాజీనామా

అన్నికులాల్లో పేదవారు ఉన్నారు. కానీ సాంఘిక సమానత్వం కావాలి, బీసీ కులాల్లోని పేదవారికి కనీసం గౌరవం దక్కడం లేదు. రాజకీయ అధికారం దక్కినప్పుడే వీరికి సమాజంలో గౌరవం దక్కుతుంది. ఊరువాడ ఏకమై ఎరకంగా తెలంగాణ సాధించామో అదే రకంగా బీసీలంతే ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసి బీసీలలో చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు పాటుపడుతానని ప్రజలందరూ పెద్ద మనసుతో బీసీ ఉద్యమ బలోపేతానికి సహకరించాలన్నారు.