Same Day - Same Way: అదే రోజు.. అదే తరహా సూసైడ్.. మధ్యప్రదేశ్‌ లో బురారీ తరహా ఘటన.. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ రైతు కుటుంబం

ఆరేండ్ల కిందట అంటే 2018లో సరిగ్గా జూలై 1న ఉత్తర ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉరేసుకొని సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

Hang (photo-Pixabay)

Bhopal, July 2: ఆరేండ్ల కిందట అంటే 2018లో సరిగ్గా జూలై 1న ఉత్తర ఢిల్లీలోని (Delhi) బురారీలో (Burari) ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉరేసుకొని సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కొన్నాళ్లపాటు ఆ ఘటనను ఎవ్వరూ మరిచిపోలేదు.  ఇదే తరహా ఘటన మధ్యప్రదేశ్‌ లో తాజాగా చోటుచేసుకున్నది. అలీరాజ్‌ పూర్‌ జిల్లాలో ఓ రైతు కుటుంబంలోని ఐదుగురు సభ్యులు  ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు అనుమానాస్పద స్థితిలో సోమవారం తమ ఇంట్లోని సీలింగ్‌ కు వేలాడుతూ, మరణించి కనిపించారు.

యూపీఐ యాప్‌ లతో విద్యుత్ బిల్లుల చెల్లింపులు వద్దు.. అధికారిక వెబ్‌ సైట్, యాప్‌ లలో మాత్రమే చెల్లించాలంటూ టీజీఎస్‌పీడీఎల్ కీలక ప్రకటన

తలుపులు తెరువకపోవడంతో..

మృతులను రాకేశ్‌ సింగ్‌, ఆయన భార్య లలిత, కుమార్తె లక్ష్మి, కుమారులు ప్రకాశ్‌, అక్షయ్‌ గా గుర్తించారు. పొద్దున అయినప్పటికీ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో.. బంధువులు వీరి ఇంటికి వచ్చి, తలుపులు తెరచి చూసే సరికి మృతదేహాలు కనిపించడంతో, పోలీసులకు సమాచారం ఇచ్చారు. బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

విమానం ఎక్కి గాలిలో ఎగరడం కాదు.. ఏకంగా రోదసిలోనే షికారు చేయొచ్చు. అది కూడా కేవలం రూ.200కే. మీకు కూడా ఈ అవకాశం ఉంది.. త్వరపడండి మరి!!



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif