Niti Aayog's Index-2019: సుస్థిర అభివృద్ధిలో సత్తా చాటిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు, తొలి స్థానంలో కేరళ, చివరి స్థానంలో బిహార్. ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనలో అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం

అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో గుజరాత్ వంటి రాష్ట్రాలను వెనక్కినెట్టి తెలంగాణ....

Niti Aayog's Index-2019 | Photo: Twitter

New Delhi, December 31: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDG- Sustainable Development Goals ) సాధనలో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ (NITI Aayog) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మరియు తమిళనాడు రాష్ట్రాలు భారతదేశంలోనే 3వ స్థానంలో నిలిచాయి. అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో గుజరాత్ వంటి రాష్ట్రాలను వెనక్కినెట్టి తెలంగాణ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 6 స్థానాలను మెరుగుపరుచుకుంది. .

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక 2019-20లో 70 పాయింట్లతో కేరళ అగ్రస్థానంలో నిలవగా, 69 పాయింట్లతో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 67 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాయి.

ఉత్తర ప్రదేశ్, ఒడిశా, సిక్కిం మెరుగైన పురోగతి చూపగా, గుజరాత్ వంటి రాష్ట్రాలు గతేడాదితో పోలిస్తే ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ ర్యాంకింగ్స్ లో బిహార్ రాష్ట్రం అట్టడుగున నిలిచింది.

Here's the update:

నీరు మరియు పారిశుధ్యం, విద్యుత్ మరియు పరిశ్రమల భారత్ గతేడాదితో పోలిస్తే కొంతవరకు మెరుగుపడింది. అయితే పోషకాహారం మరియు లింగ సమానత్వంలో మాత్రం ఇంకా వెనకబడే ఉంది.

"రాష్ట్రాల భాగస్వామ్యంతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము" అని ఎన్‌ఐటిఐ ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్ ఎస్‌డిజి ఇండియా ఇండెక్స్ 2019-20 సమావేశంలో పేర్కొన్నారు.

ఎంపిక చేసిన జాతీయ 100 సూచికలలో 16 లక్ష్యాల సాధన ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ ఇవ్వబడుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు యూటీలలో ఈ సూచీలను పరిగణలోకి తీసుకుంటారు.

ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ నెంబర్ 1

 

ఆర్థికాభివృద్ధి, అసమానతల తగ్గింపులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్, నిరుద్యోగ నిర్మూలన, శ్రామిక శక్తిని పెంచడం తదితర విభాగాలలో మెరుగైన ఫలితాలు సాధించడమే ఇందుకు కారణం. ఈ విభాగంలో తెలంగాణ రాష్ట్రం 82 పాయింట్లు సాధించింది. ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ 100కు 98.28 పాయింట్లతో దేశంలో ఏ రాష్ట్రం దరిచేరలేని టాప్ స్కోరును సాధించింది.

ఆరోగ్యం మరియు శ్రేయస్సు, స్వచ్ఛమైన నీరు మరియు పారిశుధ్యం, చౌక మరియు శుద్ధ ఇంధనం, పరిశ్రమలు మరియు నూతన ఆవిష్కరణలు, అసమానతల తగ్గింపు, నాణ్యమైన విద్య మరియు పేదరిక నిర్మూలన తదితర కేటగిరీల్లో తెలంగాణ ఫ్రంట్ రన్నర్ గా నిలిచింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif