Dog Attack in Telangana: ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్క దాడి, తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన చిన్నారి
గమనించిన కుటుంబ సభ్యులు బాలుడికి చికిత్స చేయించారు.
Hyd, July 25: ఇటీవల కాలంలో చిన్నారులపై వీధికుక్కల దాడులు పెరిగిపోయాయి. రోజూ ఎక్కడో ఒక చోట వీధికుక్కలు దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో పర్వతగిరికి చెందిన మనోజ్ కుమారుడు విహాన్ ఉదయాన్నే ఇంటిముందు ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేయడంతో గాయాల పాలయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాలుడికి చికిత్స చేయించారు.
కాగా వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి దుర్మరణం చెందిన విషాద ఘటన హైదరాబాద్‌లో తాజాగా వెలుగు చూసిన సంగతి విదితమే. నగరంలోని జవహర్‌నగర్ లో రెండేళ్ల బాలుడు విహాన్‌పై వీధి కుక్కలు అత్యంత పాశవికంగా దాడి చేయగా అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. విహాన్ ఆరు బయట ఆడుకుంటుండగా మంగళవారం రాత్రి వీధి కుక్కలు ఒక్కసారిగా చుట్టుముట్టి దాడి చేశాయి. వీడియో ఇదిగో, ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్కల గుంపు దాడి, తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి..
ఈ ఘటనపై హైకోర్టు విచారణ కూడా జరిపింది.వీధి కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ సమాధానమిస్తూ... జీహెచ్ఎంసి వ్యాప్తంగా 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని, కుక్కల దాడి ఘటనలు నివారించేందుకు ప్రభుత్వం స్టేట్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేసిందని తెలిపారు. హైదరాబాద్ లో ఆరు కేంద్రాల వద్ద కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నారని, ఒక్కో కేంద్రం వద్ద సుమారు రోజుకు 200 కుక్కలకు స్టెర్లైజేషన్ చేస్తున్నారని కోర్టుకి వెల్లడించారు.