Singhvi Attacks Jio: లాలీపాప్ ఎంత పెద్దదైనా చివరకు ఏదీ ఉచితం కాదు, మోడీ సర్కార్‌ది కూడా అదే పరిస్థితి ! ట్విట్టర్ వేదికగా బిజెపి, జియోపై సెటైర్లు వేసిన కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ
ఆ తర్వాత మెల్లిగా ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. వినియోగదారులపై చార్జీల మోతను స్టార్ట్ చేసింది.
New Delhi, October 11: దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో ప్రారంభంలో ఉచిత ఆఫర్లతో సునామిని తలపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెల్లిగా ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. వినియోగదారులపై చార్జీల మోతను స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా నాన్ జియో ఔట్‌గోయింగ్ కాల్స్ పై ఇక నుంచి నిమిషానికి 6 పైసలు చెల్లించాల్సిందేనట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో అంతా ఒక్కసారిగా సందిగ్ధంలో పడిపోయారు. దీనిపై విభిన్న రకాలుగా ట్రోలింగ్స్ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.
ఈ సమయంలో కాంగ్రెస్ నేత మనుసింఘ్వీ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు. బీజేపీతో పాటు జియోకి కూడా ట్విటర్ వేదికగా తనదైన శైలిలో చురకలు వేశారు.
సింఘ్వీ ట్వీట్
రిలయన్స్ జియో తమ వినియోగదారులపై చార్జీలు మోపాలని జియో నిర్ణయించింది. మీకు ఆఫర్ చేసిన లాలీపాప్ ఎంత పెద్దదైనా.. చివరికి ఏది ఉచితం కాదని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ప్రస్తుత మోడీ సర్కార్‌ది కూడా ఇదే పరిస్థితి..’’ అని సింఘ్వీ పేర్కొన్నారు.అటు జియోను, ఇటు మోడీ పాలనను కలిపి చురకలు అంటించారు.
జియో వసూలుపై సంస్థ ప్రకటన వెల్లడించింది. దీని ప్రకారం ఐడియా, ఎయిర్ టెల్ వంటి నెట్ వర్క్ వాడుతున్న కస్టమర్లకు జియో నుంచి కాల్ చేయాలంటే ఇకపై నిమిషానికి ఆరు పైసలు చెల్లించాలి. ఇకపై జియోలో ఉచిత కాల్స్ ఉండవు
ఐయూసీ నిబంధనలను బూచీగా చూపిస్తూ జియో నుంచి వేరే నెట్ వర్క్ కస్టమర్లకు చేసే కాల్స్ పై డబ్బు వసూలు స్టార్ట్ చేసింది. ట్రాయ్ నిబంధనలను మార్చి, ఐయూసీ చార్జీలు పెంచితే ఆ పెంచిన దాని ప్రకారమే జియో కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేయనున్నట్లు జియో ప్రకటించింది. తప్పనిసరి టాక్‌టైమ్ టారిఫ్ ప్లాన్స్ అమలు చేయాల్సి ఉన్నందున ఔట్ గోయింగ్ కాల్స్‌పై వసూలు చేసే చార్జిలకు ప్రతిగా ఉచిత డేటా ఓచర్లు ఇవ్వనున్నట్టు జియో పేర్కొంది.