Vande Bharat Sleeper Coach First Look: వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌లలో ఉండే సౌకర్యాలు ఇవే, ఫస్ట్ లుక్ వీడియోని విడుదల చేసిన కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, వీడియో ఇదిగో..

మరో మూడు నెలల్లో ఈ తరహా రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

Vande Bharat Sleeper Coach First Look (photo-X/Video Grab)

New Delhi, Sep 1: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ కోచ్ (Vande Bharat Express Sleeper)రైళ్లను త్వరలోనే పట్టాలు ఎక్కించేందుకు భారత రైల్వేశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. మరో మూడు నెలల్లో ఈ తరహా రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

ఆదివారం ఆయన బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎమ్‌ఎల్‌) తయారీ కర్మాగారంలో వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌ ప్రొటోటైప్‌ వెర్షన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రైల్వేశాఖ దేశ వ్యాప్తంగా నడుపుతోన్న వందే భారత్‌ హైస్పీడ్‌ రైళ్లకు విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో సరికొత్త హంగులతో స్లీపర్‌ కోచ్‌లతో వందే భారత్‌ రైళ్లను రూపొందిస్తోంది. తాజాగా స్లీపర్‌ కోచ్‌లకు సంబంధించిన దృశ్యాలు విజువల్స్‌ బయటకు వచ్చాయి.  వందే భారత్‌ స్లీపర్‌ కోచ్ వీడియో ఇదిగో, మరో 3 నెలల్లో పట్టాలు ఎక్కనున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైష్ణవ్‌ మాట్లాడుతూ ఈ రోజు ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. వందే భారత్‌ చైర్‌ కార్‌ విజయవంతమైన తర్వాత, వందే భారత్‌ స్లీపర్‌ కోసం చాలా శ్రమించామని చెప్పారు. వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ల తయారీ ఇప్పుడే పూర్తయిందన్నారు.

Here's Video

పది రోజుల పాటు వీటికి కఠినమైన ట్రయల్స్‌, టెస్ట్‌లు నిర్వహించనున్నామని తెలిపారు. మూడు నెలల్లో ప్రయాణికులకు ఈ కోచ్‌ల సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌లలో ఉండే సౌకర్యాలు ఇవే...

కోచ్‌లలో రీడింగ్‌ ల్యాంప్స్‌, ఛార్జింగ్‌ అవుట్‌లెట్‌లు, స్నాక్‌ టేబుల్, మొబైల్‌/ మ్యాగజైన్‌ హోల్టర్స్‌ ఉంటాయి.

రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే ‘కవచ్‌’ వ్యవస్థ ఉంటుంది.

అన్ని కోచ్‌లు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బాడీతో నిర్మించారు. లోపల జీఎఫ్‌ఆర్‌పీ ఇంటీరియర్ ప్యానెల్స్ ఉంటాయి.

కోచ్‌లన్నీ అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి.

ఆటోమేటిక్‌ డోర్లు, మెరుగైన సదుపాయాలతో మరుగు దొడ్లు, కొత్త టెక్నాలజీతో రూపొందించిన సీటు కుషన్‌లు ఇందులో అమర్చారు.

16 కోచ్‌లు, 823 బెర్త్‌లతో స్లీపర్‌ ట్రైన్‌ రానుంది. వీటిలో పదకొండు 3టైర్‌ ఏసీ కోచ్‌లు (600 బెర్త్‌లు), నాలుగు 2 టైర్‌ ఏసీ కోచ్‌లు (188 బెర్త్‌లు), ఒక ఫస్ట్‌ టైర్‌ ఏసీ కోచ్‌(24 బెర్త్‌లు) ఉంటాయి.