New Year celebrations in Telangana: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నవారికి అలర్ట్.. రాత్రి 8 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు.. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం.. న్యూఇయర్ వేడుకల వేళ హైదరాబాద్‌లో ప్రత్యేక ఆంక్షలు.. అర్ధరాత్రి 12.15 గంటల వరకు నడవనున్న మెట్రో రైళ్లు

2023 చరిత్రలో కలిసిపోనుంది. కొత్త ఏడాదికి గ్రాండ్‌ గా వెల్‌కమ్ చెప్పేందుకు తెలంగాణ యువత ఇప్పటికే సిద్దమైంది.

Hyderabad, Dec 31: మరికొన్ని గంటల్లోనే నూతన ఏడాది (New Year) 2024 మొదలుకానుంది. 2023 చరిత్రలో కలిసిపోనుంది. కొత్త ఏడాదికి గ్రాండ్‌ గా వెల్‌ కమ్ (Welcome) చెప్పేందుకు తెలంగాణ యువత (Telangana Youth) ఇప్పటికే సిద్దమైంది. వీకెండ్ ఆదివారం రావడంతో యువతలో మరింత జోష్ కనిపిస్తోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి రోడ్లపై హంగామా సృష్టించేవారికి అడ్డుకట్ట వేయాలని తెలంగాణ పోలీసు శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రాఫిక్, లా అండ్‌‌ ఆర్డర్‌‌‌‌ పోలీస్‌‌ స్టేషన్స్‌‌ పరిధిలో చెక్‌‌పాయింట్స్, బ్రీత్ ఎనలైజర్‌‌‌‌ టెస్ట్‌ ‌లు తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్‌‌ డ్రైవ్, డ్రగ్‌‌ డిటెక్షన్‌‌ టెస్ట్‌ ‌లు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు  రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్‌‌పీ కార్యాలయాలకు డీజీపీ ఆఫీస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మద్యం సేవించి పట్టుబడినవారి వాహనాలను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిపై పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. ఆల్కాహాల్ కంటెంట్‌ ని బట్టి చర్యలు తీసుకోనున్నారు. రూ.10 వేలు జరిమానా, 6 నెలల జైలుశిక్ష వంటి చర్యలు తీసుకోనున్నారు. ఇక న్యూ ఇయర్ ఈవెంట్లను అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా కొనసాగిస్తే కేసులు నమోదు చేయనున్నారు.

Tenth exams Schedule: తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌, మార్చి 18 నుంచి ప‌రీక్ష‌లు షురూ, పూర్తి షెడ్యూల్ ఇది

హైదరాబాదీలూ బీ అలర్ట్..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు తనిఖీలు చేయనున్నారు. ఇక ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌పై ఎయిర్‌‌పోర్ట్‌‌ కు వెళ్లే వాహనదారులకు మాత్రమే అనుమతి ఇస్తారు. నగరంలోని లంగర్‌‌‌‌హౌస్‌‌, బేగంపేట్ ఫ్లై ఓవర్ మినహా అన్ని ఫ్లై ఓవర్స్‌‌, ట్యాంక్‌‌బండ్‌‌, నెక్లెస్‌‌ రోడ్ మూసివేయనున్నారు. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి 12.15  గంటల వరకు నగరంలో మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

Happy New year 2024 Wishes: మీ బంధు మిత్రులకు Images, Greetings, Quotes in Telugu రూపంలో నూతన సంవత్సరం 2024 విషెస్ తెలపండి