Father's Day Quotes: హ్యాపీ ఫాదర్స్ డే వాట్సప్ మెసేజెస్, నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే ఓ భద్రత, పితృ దినోత్సవ శుభాకాంక్షలు ఈ మెసేజెస్‌తో వారికి చెప్పేయండి
నాన్న ఆ బిడ్డకు జీవితాన్ని అందిస్తారు. వేలు పట్టి నడిపిస్తూ లోకాన్ని చూపుతాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి.
పితృ దినోత్సవ శుభాకాంక్షలు: అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోస్తే.. నాన్న ఆ బిడ్డకు జీవితాన్ని అందిస్తారు. వేలు పట్టి నడిపిస్తూ లోకాన్ని చూపుతాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి. బయటకు గంభీరంగా కనిపించినా.. మనసులో బోలెడంత ప్రేమను దాచుకుంటాడు. పిల్లల భవిత కోసం తన వ్యక్తిగత సంతోషాన్ని సైతం త్యజించే త్యాగమూర్తి నాన్న. నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే ఓ భద్రత, భరోసా. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు. పితృ దినోత్సవం ఎప్పుడు మొదలైంది? ఎన్ని దేశాల్లో అంతర్జాతీయ పితృ దినోత్సవం జరుపుకుంటున్నారు, హ్యాపీ ఫాదర్స్ డే WhatsApp Stickers, Facebook Greetings, GIF Images, SMS and Messages మీకోసం
జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. ఈ క్రమంలో తన అవసరాలు, ఆరోగ్యం అన్నింటినీ పక్కనబెడతాడు. తన బిడ్డల ఎదుగుదలను మురిసిపోతాడు. పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. అలాంటి నాన్నను ఏడాదిలో ఒక్కసారైనా గౌరవించడం మన బాధ్యత. అందుకే ఏటా జూన్ మూడో ఆదివారం రోజున ‘ఫాదర్స్ డే’ను (Father’s Day 2021) నిర్వహిస్తున్నారు. ఈ మెసేజెస్ ద్వారా నాన్నకు శుభాకాంక్షలు చెప్పేద్దాం.
అమ్మాయిని తండ్రి కంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరు. ప్రతి తండ్రికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు
నాన్న మాటల్లో ప్రేమ ఉంటుంది. కోపంలో బాధ్యత ఉంటుంది. అణుక్షణం బిడ్డ గురించే అతని ఆలోచనలు. ప్రతి తండ్రికీ పితృ దినోత్సవ శుభాకాంక్షలు
దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి నాన్న, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. హ్యాపీ ఫాదర్స్ డే
నాన్న నా ఆశ. నా శ్వాన. నాన్నా అందుకో పితృ దినోత్సవ శుభాకాంక్షలు